CIBIL Score: మీ సిబిల్ స్కోర్ 500 కంటే తక్కువగా ఉందా? ఈ టిప్స్ పాటిస్తే...800 అవ్వడం గ్యారెంటీ..!!

Tips To Boost CIBIL Score : నేటికాలంలో క్రెడిట్ కార్డు వాడకం సాధారణంగా మారింది.ఒక్కరు రెండు మూడు క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వాడుతున్నవారు సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయడం చేయడం చాలా ముఖ్యం. మీ క్రెడిట్ స్కోర్ 500కంటే తక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ను ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే మీ సిబిల్ స్కోర్ 800లకు పెరగడం ఖాయం. ఎలాగో చూద్దాం. 
 

1 /6

How To Increase CIBIL Score : ఏ లోన్ తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన సిబిల్ స్కోర్ సరిగ్గా ఉంటేనే బ్యాంకులు మనకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. లేదంటే రిజక్ట్ చేస్తాయి. అంతేకాదు వడ్డీ రేటు కూడా మన సిబిల్ స్కోర్ ను బట్టే బ్యాంకులు విధిస్తాయి. సకాలంలో రుణాలు చెల్లించడం వల్ల మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. లేదంటే తగ్గిపోతుంది. అది మీ లోన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే చాలా మందిలో సిబిల్ స్కోర్ పై సందేహాలు, అపోహాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.   

2 /6

చాలా మంది కొత్తగా జాబ్ జాయిన్ అవ్వగానే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఫస్ట్ క్రెడిట్ కార్డును పొందడం చాలా కష్టం. తర్వాత దానికి బిల్లు సకాలంలో చెల్లిస్తే..కార్డులు ఇస్తామంటూ బ్యాంకులు చెబుతుంటాయి. ఈ క్రమంలోనే సిబిల్ స్కోర్ ను పెంచుకునేందుకు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ సిబిల్ స్కోర్ మెరుగు పడుతుంది. ఎలాగో  చూద్దాం.   

3 /6

ఆదాయానికి సిబిల్ స్కోర్ కు సంబంధం లేదు:  సిబిల్ స్కోర్ బాగుండాలంటే ఆదాయం బాగుండాలన్న అపోహ చాలా మంది ఉంటుంది. క్రెడిట్ బ్యూరోలు చెప్పే వివరాల్లో బ్యాంకు అకౌంట్ల పేర్లు కూడా ఉంటాయి. కానీ బ్యాంకు అకౌంట్లలో బ్యాలెన్స్ ఉంది..ఖాదాదారుల ఆదాయం ఎంత అనేది అందులో ఉండదు. రూ. 5లక్షలు సంపాదిస్తున్న వారికి మంచి  సిబిల్ స్కోర్ ఉంటే..కొన్ని సార్లు రూ. 20లక్షల ఉన్నవారికి సిబిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది. అదాయంతో ఎలాంటి సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించినట్లయితే మీ సిబిల్ స్కోర్ అటోమెటిగ్గా పెరిగిపోతుంది.   

4 /6

పరిమితి మించి వాడకూడదు: చాలా మంది క్రెడిట్ కార్డును పరిమితి మించి వాడకపోయిన స్కోరుపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదననుకుంటారు. కానీ కార్డు లిమిట్ లో 40శాతానికి మించి వాడితే క్రెడిట్ స్కోరుపై ఎఫెక్ట్ పడుతుంది. మీ కార్డు లిమిట్ రూ2లక్షలు అయితే ..ఎప్పుడు 80వేలకు మించి వాడకూడదు. కానీ కొంతమంది లిమిట్ ను మించి వాడుతుంటారు. ఇది సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. 

5 /6

సిబిల్ స్కోర్ బాగుంటే: కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా ఏదైనా లోన్ కోసం అప్లయ్ చేసుకున్న ప్రతిసారీ మీ సిబిల్ స్కోర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్నప్పుడే మీరు అప్లయ్ చేసుకున్న లోన్స్ వస్తాయి. తక్కువ కాలంలో రెండు మూడు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకునేందుకు ప్రయత్నించినా సిబిల్ స్కోర్ తగ్గుతుంది.   

6 /6

ఇలా సిబిల్ స్కోర్ పెంచుకోండి:  చాలా మందికి సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదు. మీరు మీ క్రెడిట్ స్కోర్ మీ ఫైనాన్షియల్ హిస్టరీ ను తెలపుతుంది. రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే కాలక్రమేణ మీ  సిబిల్ స్కోర్ ను పెంచుకోవచ్చు. సాధారణంగా సిబిల్ హిస్టరీలో లావాదేవీలు మూడు నుంచి నాలుగేండ్ల పాటు ఉంటాయి. పెండింగ్ లోన్స్ డీటెయిల్స్ పదేండ్ల వరకు ఉంటాయి. కనీసం 3 నుంచి 5ఏండ్లపాటు మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే సిబిల్ స్కోర్ ను మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు నిపుణులు