Da Hike News: ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని శుభవార్త.. మరోసారి 4 శాతం పెరిగిన DA..

7Th Pay Commission - Da Hike News: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని డియర్‌నెస్ అలవెన్స్ (DA)  ను ఏకంగా నాలుగు శాతం కు పైగా పెంచింది. అయితే ఏ రాష్ట్ర సర్కార్ ఇంత డియర్‌నెస్ అలవెన్స్ ను పెంచిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
 

7Th Pay Commission: పంజాబ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి సందర్భంగా అద్భుతమైన గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షన్ దారులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వస్తువుల ధరలను, ఖర్చులను దృష్టిలో పెట్టుకుని దీపావళి కానుకగా రాష్ట్ర సర్కార్ నాలుగు శాతం డియర్‌నెస్ అలవెన్స్ ను పెంచింది. ఈ అలవెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న అన్ని శాఖలకు సంబంధించిన ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. 
 

1 /5

బుధవారం పెరిగిన నాలుగు శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని నవంబర్ 1 నుంచి వర్తించేలా నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల కింద పనిచేస్తున్న 6.50 లక్షల మంది ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ప్రయోజనం కలుగుతుంది.   

2 /5

ప్రభుత్వం ఈ డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని ప్రకటించడంతో ఇప్పుడు కరువు భత్యం 38 శాతం నుంచి 42 శాతానికి పెరుగుతుందని అధికారులు తెలిపారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపింది. అలాగే వారి సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లను కూడా త్వరలోనే నెరవేర్చబోతున్నట్లు ప్రకటించింది. 

3 /5

ఈ పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని సంబంధించిన అధికారిక ప్రకటనను బుధవారం సీఎంతో పాటు ఇతర రాష్ట్ర క్యాబినెట్ వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇస్తూ ప్రత్యేకంగా లేక ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.  

4 /5

ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు, పింఛన్దారులు ప్రత్యేకమైన భాగమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతు మాన్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ఎలాంటివైనా తీర్చేందుకు సర్కార్ ముందుంటుందని ఆయన అన్నారు. అలాగే త్వరలోనే వారికి సంబంధించిన డిమాండ్లను కూడా నెరవేర్చబోతున్నట్లు తెలిపారు.  

5 /5

ఈ పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (DA) వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణం కారణంగా ఎదురవుతున్న అదన భారం తొలగిపోబోతోంది అంతేకాకుండా కుటుంబ సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లు కూడా నెరవేరబోతున్నాయి. ఈ అలవెన్స్ పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులు దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.