Deepika Padukone: ఏంటీ దీపికా ఇది.. గ్యాప్ తీసుకొకుండా మళ్లీ ఇంతపెద్ద ట్విస్టా.?.. షాక్ లో నెటిజన్ లు..

Deepika padukone in news: దీపికా పదుకొనే ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. వినాయక నవరాత్రులలో దీపిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

1 /8

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఇటీవల గణపయ్య నవరాత్రులలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అప్పటి నుంచి ఆమె కొన్ని రోజుల పాటు తన బిడ్డను చూసుకొవడంతో బిజీగా ఉంటున్నారని తెలుస్తోంది.

2 /8

రవ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు ఇద్దరి మధ్య డేటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఈ జంట సినిమాల్లో నటిస్తునే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు.

3 /8

బాలీవుడ్ లో దీపికా, రన్ వీర్ సింగ్ లది ది బెస్ట్ జోడీలలో ఒకటిగా చెప్తుంటారు. అయితే..సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు ఈ  భామ జన్మనిచ్చారు. ఆమె కడుపుతో ఉన్నప్పుడు కూడా కల్కీ మూవీలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. 

4 /8

అయితే.. అప్పట్లో చాలా మంది దీపికాను ట్రోల్స్ చేశారు. కడుపుతో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొకుండా.. ఈ సినిమాలో ఏంటని, మరీ ఇంత కక్కుర్తీ అవసరమా.. అంటూ కూడా కామెంట్లు సైతం చేశారు. మరొవైపు ఈ భామ బిడ్డతో ఎంజాయ్ చేస్తుందనుకుంటే మళ్లీ సెట్స్ మీద దర్శనమిచ్చింది. 

5 /8

అది కూడా తన భర్త రన్ వీర్ సింగ్ తో కలిసి దీపికా పదుకొనే ఒక యాడ్ చేసినట్లు తెలుస్తోంది. బిడ్డపుట్టి కనీసం రెండు నెలలు కూడా గడవక ముందే మళ్లీ సెట్స్ మీదకు రావడం ఏంటని ఫ్యాన్స్ షాక్ కు గురౌతున్నారంట.

6 /8

చాలా మంది సెలబ్రీటీలు ఇటీవల దీపం ఉనప్పుడే.. ఇల్లు సర్ది పెట్టుకొవాలన్నట్లుగా మారిపోయారు. తమకు అవకాశాలు వస్తున్నప్పుడు ఎందుకు మిస్ చేసుకొవడం అన్న విధంగా తయారయ్యారని టాక్ నడుస్తోంది. అందుకు ప్రెగ్నెంట్ గా ఉన్న, పిల్లల్ని కన్న కూడా గ్యాప్ తీసుకొకుండా.. చాన్స్ లు వస్తే నటించడానికి మాత్రం ఏమాత్రం వెనక్కు రావడంలేదని తెలుస్తోంది.

7 /8

గతంలో ఆలియా భట్ సైతం.. బిడ్డ పుట్టాక కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వచ్చేశారు. ఇప్పుడు కల్కీ భామ మళ్లీ సెట్స్ పైకి రావడం మాత్రం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. కొంత మంది మాత్రం కొన్ని నెలలు హ్యాపీగా బిడ్డతో ఎంజాయ్ చేయోచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.

8 /8

మరికొందరు మాత్రం.. పిల్లలు పుట్టాక కూడా.. తమకు చాన్స్ లు వస్తే.. ఎందుకు నటించకూడదని కూడా.. కౌంటర్ గా ప్రశ్నలు వేస్తున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికి కేరియర్ ఊపుమీద ఉన్నప్పుడు ఏదైన చేసేయాలని మరికొందరు అంటున్నారు. దీంతో దీపిక పదుకొనే మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచారు.