Trisha marriage: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో యువతను ఆకట్టుకున్న ఈమె తెలుగులో వర్షం సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుని ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ కూడా అదే స్టేటస్ ను సొంతం చేసుకొని బిజీగా మారింది. ప్రస్తుతం త్రిష కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.
సౌత్ ప్రేక్షకులకు త్రిష గురించి ప్రత్యేకపరిచారు అవసరం లేదు. కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైన త్రిష ఆ తర్వాత అవకాశాలు లేక కొంతకాలం ఇంటికే పరిమితమైంది. ఇక ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీయంట్రీ వచ్చి మళ్లీ తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇస్తోంది త్రిష.
ఇకపోతే కెరియర్ పరంగా స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈమె వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో ఒక బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న త్రిష నిశ్చితార్థం కూడా జరుపుకుంది. కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్ధాన్ని కాస్త క్యాన్సిల్ చేసుకుంది.
దీనికి తోడు ఎన్నోసార్లు రూమర్స్ లో చిక్కుకుంది త్రిష. గతంలో వర్షం సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తో ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే త్రిష ఇంకొకరితో క్లోజ్ గా ఉండడం చూసి ప్రభాస్ తట్టుకోలేక ఆమెను దూరం పెట్టాడని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఏది కూడా నిజం కాలేకపోయింది.
దీనికి తోడు ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ప్రేమలో ఉందని ,అతనితో రహస్యంగా చట్టపట్టలేసుకొని తిరుగుతోందంటూ వార్తలు వచ్చాయి. అందులో కూడా నిజం లేదనే చెప్పాలి.
ఇప్పుడు మళ్లీ వివాహానికి సిద్ధమైందంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే అని, కానీ విజయ్ మాత్రం కాదు అంటూ ఒక వార్త వైరల్ అవ్వడంతో మరి అతడు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఫారిన్ లో ఉంటున్నట్టు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అక్కడ పెళ్లికి ముందే బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి వెళ్ళింది అంటూ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్తలు కూడా ఇప్పుడు రూమర్స్ గానే మిగిలిపోతాయేమో చూడాలి.