Devara vs Acharya: దేవర బ్లాక్ బాస్టర్.. ట్రెండ్ అవుతున్న ఆచార్య..!

Devara Review:  దేవర ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఆచార్య బ్యాచ్ ఏ రేంజ్ లో అయితే కొరటాల శివ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారో.. ఇప్పుడు అదే రేంజిలో దేవరా బ్లాక్ బస్టర్ అని ట్వీట్ పడుతూనే మరొకవైపు ఆచార్య ను ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. 

1 /5

కొరటాల శివ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం తాజాగా విడుదల అయింది.  సినిమా చూసిన ఆడియన్స్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని , సింగిల్ హ్యాండ్ తో సినిమాని బ్లాక్ బస్టర్ చేసేసారు అంటూ అటు ఎన్టీఆర్ పై ఇటు కొరటాల శివ పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. 

2 /5

అయితే ట్విట్టర్లో దేవర బ్లాక్ బస్టర్ అంటూ ఏ రేంజ్ లో అయితే ట్వీట్స్ పడుతున్నాయో.. అదే రేంజ్ లో ఆచార్య కూడా ట్రెండ్ అవుతోందని చెప్పవచ్చు.అసలు విషయంలోకెళితే కొరటాల శివ గతంలో మిర్చి, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని, అదే జోష్ లో చిరంజీవి,  రామ్ చరణ్ లతో కలిసి ఆచార్య సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.   

3 /5

ఈ సినిమా డిజాస్టర్ అవడంతో చిరంజీవి కూడా కొరటాల శివదే తప్పు అంటూ కామెంట్లు చేశారు. దీనికి తోడు దేవర ట్రైలర్.. విడుదలైనప్పుడు కూడా కొరటాల ఆచార్య నుంచి బయటకు రాలేకపోతున్నాడని, దేవరలో చాలా ఘట్టాలు ఆచార్యలో ఉండే పాదఘట్టం లాగే ఉన్నాయి అంటూ చాలామంది ట్రోల్ కూడా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అవుతుంది అని కూడా భయాందోళనలు కలిగించారు. 

4 /5

అయితే ఎట్టకేలకు సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ మూవీ పై ట్రోల్స్ చేసిన వారందరికీ నోరు మూయించిందని చెప్పాలి. దేవర ట్రైలర్ విడుదల అయినప్పుడు మెగా అభిమానులు ఏ రేంజ్ లో అయితే అటు కొరటాల శివను ఇటు దేవర మూవీని తక్కువ చేశారో.. ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ అభిమానులు ఆచార్య ను తెరపైకి తీసుకొస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరోపక్క చిరంజీవి అభిమానులు మాత్రం.. ఇప్పటికీ దేవర ఫ్లాప్ అంటూ.. ఆచార్యాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఆచార్య సినిమా ట్విట్టర్లో ప్రస్తుతం తెగ ట్రెండ్అవుతుంది.

5 /5

మొత్తానికి అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ ను వెనక్కి నెట్టి కొరటాల శివ తన మార్క్ చూపించారని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతకుమించి విజయాన్ని అందుకోబోతోందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రీ రిలీజ్ లో రూ.180 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ఈజీగా రూ.350 కోట్లు రాబడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కొరటాల శివ తన మార్కు చూపించారని స్పష్టం అవుతోంది.