Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది.
దిశా పటానీ కెరీర్ లో వరుస సక్సెస్ లున్న హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ రేపడం దిశా పటానీ మార్క్ స్టైల్.
రీసెంట్ గా దిశా పటానీ.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ‘కల్కి 2898 AD’ మూవీలో నటించింది. ఈ చిత్రంలో దిశా చేసిన క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఏదో ప్రభాస్ తో ఓ సాంగ్ కోసం తప్పించి దిశాకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు.
దిశా పటానీ ఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన అప్డేట్స్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. ఈమెకు ఇన్ స్టాగ్రామల్ లో 61.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తోన్న దిశా..రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో నటించింది. ఇందులో Roxie పాత్రలో కనిపించింది. అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా సౌత్ సినీ ప్రేక్షకులను పలకరించబోతుంది.
బాలీవుడ్ లో సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీలో విలన్ పాత్రలో మెప్పించింది. త్వరలో 'వెల్కమ్ బ్యాక్ టూ ద జంగిల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.