Mars Transit 2023: అంగారకుడు సంచారంతో ఈ 5 రాశుల వారికి బోలెడు ప్రయోజనాలు, ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!

Mars Transit In Virgo 2023: అంగారక గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు తీవ్ర ఇబ్బందులు పడితే మరికొన్ని రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎవరి జాతకం లోనైతే అంగారకుడు శుభస్థానంలో ఉంటే వారికి ఊహించని లాభాలతో పాటు జీవితం సంతోషంగా గడుపుతారు. ఇంతకీ మీ జాతకంలో అంగారకుడు శుభస్థానంలోనే ఉన్నాడా?
 

  • Aug 12, 2023, 13:06 PM IST

Mars Transit In Virgo 2023: జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఆగస్టు 18వ తేదీన అంగారకుడు తన రాశిని వదిలి కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. శక్తి, ధైర్యం, శౌర్యంనికి సూచికగా భావించే ఈ గ్రహం సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

1 /5

మీన రాశి వారికి అంగారక గ్రహ సంచారం కారణంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.  

2 /5

అంగారపుడి సంచారం ఎఫెక్ట్ కుంభ రాశి వారిపై కూడా సమానంగా పడుతుంది. ఈ క్రమంలో కుంభ రాశి వారు స్వల్ప ప్రయోజనాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారు కుటుంబం ప్రోత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారు. వీరు ఈ సంచారం కారణంగా కుటుంబంతోని ఎక్కువ గడిపేందుకు ప్రయత్నిస్తారు.  

3 /5

మేష రాశి వారికి అంగారక గ్రహం సంచారం కారణంగా కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా కోపం కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.

4 /5

వృషభ రాశి వారికి ఈ సంచారం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీరికి మానసిక ప్రశాంతత తగ్గి ఉద్యోగ జీవితం పై ఒత్తిడి పెరుగుతుంది దీనికి ఆనందంగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.  

5 /5

కర్కాటక రాశి వారికి అంగారక గ్రహ సంచారం కారణంగా కోరికలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వీరు కొన్ని రోజులపాటు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.