Lucky Foods: సాధారణంగా మనం తినే ఆహారం మన అదృష్టాన్ని మారుస్తుందని ఎంతమందికి తెలుసు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించిన ఇది సత్యం అని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు ఎలాంటి ఆహారం తినడం వల్ల వారి జాతకంలో శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం...
సాధారణంగా మనం తినే ఆహారంతో, గ్రహాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంటే మనం తినే ఆహారం కూడా మన జాతకంలో ఉండే గ్రహాల స్థితిని బలపరుస్తుందని, జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరైతే ఏ ఆహారంతో ఏ గ్రహం సంబంధం కలిగి ఉంది. దీనివల్ల ఎటువంటి అదృష్టం కలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో సూర్యుని స్థానం బలపడడం కోసం మామిడి, గోధుమలు, బెల్లం, రాగి పాత్రలో నిల్వవుంచిన నీరు తాగడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.
చంద్రుని ప్రభావం నేరుగా మన మనసుపై పడుతుంది. జాతకంలో చంద్రుడి బలం పెంచడం కోసం పాల ఉత్పత్తులు, తీపి, పంచదార, ఐస్ క్రీమ్, చెరకు లాంటివి తీసుకోవడం మంచిది. వెండి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కుండలిలో చంద్రుని బలం మరింత పెరుగుతుంది.
శెనగలు, పచ్చి శెనగపప్పు, పచ్చి కూరగాయలు తోపాటు వెండి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల జాతకంలో బుధ స్థానానికి బలం చేకూరుతుంది
కుజుడు స్థానం మెరుగుపడాలంటే నెయ్యి, తేనె , బెల్లం, మొక్కజొన్న వంటివి తీసుకోవాలి. అలాగే రాగి లేదా ఇత్తడి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగాలి.
జాతకంలో గృహస్పతి స్థానం బలం పుంజుకొని.. ఫలితాలు మెరుగుపడాలి అంటే సెనగపిండి, పసుపు, మొక్కజొన్న,అరటి పండ్లు, పసుపు రంగులో ఉండే పండ్లు తీసుకోవాలి.
జాతకంలో శుక్రుడి యొక్క బలం పెరగాలంటే త్రిఫల, రాతి పంచదార, దాల్చిన చెక్క, ముల్లంగి మొదలైన వాటిని ఆహారంలో తీసుకోవాలి.
శని దేవుడి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలి అంటే ఎండుమిర్చి, తమలపాకు, ఉప్పు, కరివేపాకు , నువ్వులు, ఆవాలు వంటివి తినాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవన్నీ చెప్పబడినట్లు సమాచారం. కానీ దీనికి జీ న్యూస్ కి ఎటువంటి సంబంధం లేదు. ఒకసారి జ్యోతిష్యులను సంప్రదించి పాటించగలరు.