Mohammad Azharuddin: లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా.. మాజీ ఎంపీ అజారుద్దీన్ జోస్యం

Mohammad Azharuddin Meets Revanth Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
 

  • Jan 02, 2024, 12:57 PM IST
1 /5

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని.. కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామన్నారు. 

2 /5

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అందులో రెండు గ్యారంటీలను అమలు చేశారని గుర్తు చేశారు.  

3 /5

కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో తమ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే  అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా పని చేస్తున్నారని మెచ్చుకున్నారు.   

4 /5

ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ.. ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లను గెలుస్తుందని జోస్యం చెప్పారు.   

5 /5

సచివాలయంలో మంత్రులను కలసి సందడిగా ముచ్చటించారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఫహీం, కాంగ్రెస్ నేత అసదుద్దీన్ ఉన్నారు.