Summer Fruits: వేసవి కాలం ఎండలు అల్లాడిస్తున్నాయి. ఓ వైపు డీ హైడ్రేషన్ మరోవైపు అలసట సమస్యగా మారుతున్నాయి. అందుకే ఎండాకాలంలో కొన్నిరకాల పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.
పైనాపిల్ దానిమ్మ ఆరోగ్యపరంగా అద్భుతమైన ఫ్రూట్. ఎండల్నించి ఉపశమనం కల్గించడమే కాకుండా ఇందులో ఉండే పైబర్ కారణంగా ఆరోగ్యానికి జీర్ణక్రియకు చాలా మంచిది.
నేరేడు వేసవిలో తప్పకుండా తీసుకోవల్సిన మరో ఫ్రూట్ నేరేడు. ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. శరీరాన్ని చాలా రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది. పిల్లల్నించి పెద్దల వరకూ అందరూ తినగలిగే అద్భుతమైన ఫ్రూట్. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలుంటాయి.
లిచ్చి వేసవిలో లిచ్చి బెస్ట్ ఫ్రూట్. ఇందులో పోషకాలు చాలా ఉంటాయి. కాపర్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. రక్తకణాల ఏర్పాటుకు దోహదపడతాయి.
మస్క్ మెలన్ మస్క్ మెలన్ శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇదొక సమ్మర్ స్పెషల్ ఫ్రూట్. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఆరోగ్యానికి కావల్సిన పలు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
పుచ్చకాయ భగభగమండుతున్న ఎండల్నించి ఉపశమనం పొందేందుకు శరీరాన్ని కూల్ చేసేందుకు చాలామంది కూల్ డ్రింక్స్, జ్యూస్ తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కానే కాదు. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పుచ్చకాయ వేసవిలో బెస్ట్ ఆప్షన్.