Woolly Rhino: ప్రపంచంలో ఏదో మూలన ఏదో సందర్భంలో ప్రాచీన జంతు జీవాల అవశేషాలు లభ్యమవుతుంటాయి. ఈసారి సైబీరియా ( Siberia ) లో ఒక రైనో ( Rhino ) అవశేషం శాస్త్రవేత్తల చేతికి చిక్కింది. పెద్ద పెద్ద వెంట్రుకలున్న ఈ రైనో ఎంత పురాతనమైందంటే..వింటే ఆశ్చర్యపోతారు. అవును..నిజమే..ఈ ప్రాచీన రైనో అవశేషం 40 వేల ఏళ్లనాటిది. గత 40 వేల ఏళ్ల నుంచి ఈ అవశేషం సైబీరియాలోని మంచులో కూరుకుపోయి ఉంది. గ్లేసియర్ కరగడంతో ఈ అవశేషం బయటపడింది.
Woolly Rhino: 40 వేల ఏళ్లనాటి రైనో మృతదేహం..చెక్కుచెదరకుండా..ఇదే రహస్యం