Happy Friend ship day 2024: ఫ్రెండ్ షిప్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. స్నేహం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఇంట్లో వాళ్లతో కూడా పంచుకోలేని ఎన్నో విషయాలను చాలా మంది స్నేహితులతో పంచుకుంటారు.
స్నేహితుల దినోత్సవంను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. రామాయణ, మహాభారత కాలం నుంచి కూడా స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారికో ప్రాణాలు సైతం ఇచ్చిన సందర్భాలు కొకొల్లలు. పురాణాలలో స్నేహితులనగానే.. కృష్ణుడు- కుచేలుడు, రాముడు-సుగ్రీవుడు, దుర్యోధనుడు- కర్ణుడు మొదలైన వారు పేర్లు ప్రముఖంగా విన్పిస్తుంటాయి.
మనం ఎవరితో ఉంటామో.. ఎలాంటి ఆలోచన, వ్యక్తిత్వం ఉన్నవాళ్లతో ఉంటామో.. వారి ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. అందుకే మనం మంచి వాళ్లతో స్నేహం చేయాలని కూడా పెద్ద వాళ్లు చెప్తుంటారు. కర్ణుడు నిజానికి ఎంతో శక్తివంతుడు. కానీ చెడ్డ గుణాలున్న కౌరవులవైపు ఉన్న కారణంగా చరిత్రలో చెడ్డపేరు మూటగట్టుకున్నాడు.
స్నేహనికి ఆస్తి పాస్తులు, రంగులు, హోదాలు వంటి బేధాలు ఏవి ఉండవు.మనకు ఒక్కసారిగా కనెక్ట్ అయితే.. కొందరు ఇంట్లో వాళ్లకు కూడా ఇవ్వనంతా ప్రయారిటీ మిత్రులకు ఇస్తుంటారు. తమ కష్టాసుఖాలు, ఇంట్లో వాళ్లతో కూడా పంచుకోలేని మనస్సులోని బాధలు ప్రతి ఒక్కటి కూడా తమ స్నేహితులతో పంచుకుంటారు. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా టూర్లకు వెళ్తుంటారు.
చాలా మంది స్నేహితుల దగ్గరే కొత్త విషయాలు నెర్చుకుంటారు. ఒకరితో స్నేహంచేస్తే.. కొందరు ప్రాణాలు సైతం ఇవ్వడానికైన, దేనీకైన సరే వెనుకాడరు. మరికొందరు తమ మిత్రుడి కోసంఎలాంటి త్యాగాలు సైతం చేయడానికి వెనుకాడరు. అదే విధంగా స్నేహితులు తలచుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైన ఎదుగుతారని చెప్తుంటారు.
కష్టం, సుఖం, బాధ, ఎంజాయ్ అన్నింట్లో కూడా ఒక్క మంచి స్నేహితుడు దొరికితే లైఫ్ లో ఏదైన సాధించవచ్చని చాలా మంది చెప్తుంటారు. ఇంతటి గొప్పదైన స్నేహితుల దినోత్సవంను ప్రతిఏడాది ఆగస్టు నెలలో మొదటిఆదివారం రోజు జరుపుకుంటాము. అసలు స్నేహితుల రోజు వెనుక ఉన్న ఈ విషయాలు తెలుసుకుందాం.
హల్ మార్క్ గ్రీటింగ్ కార్డుల ఓనర్ జోస్ హాల్.. 1958 లో తొలిసారి ఫ్రెండ్ షిప్ డే వేడుకలు నిర్వహించాడంట. కానీ దీని వెనుక కేవలం వ్యాపార వ్యూహం మాత్రమే ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా.. క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలుపెట్టాయి.
అదే విధంగా 2011 లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకునేందుకు జులై 30 ను నిర్ణయించింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో స్నేహితుల దినోత్సవంను జరుపుకుంటుంటారు. ఇంగ్లీష్ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన 'విన్నీ ది పూహ్' కార్టూన్ క్యారెక్టర్ టెడ్డీబేర్‌ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ భార్య నానె అన్నన్ 1998లో ప్రకటించారు.
భారతదేశంతో పాటు.. బంగ్లాదేశ్, యూఏఈ, మలేషియా, యూఎస్ దేశాలు ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజు స్నేహితుల దినోత్సవం ను సెలబ్రేట్ చేసుకుంటారు.పాకిస్థాన్‌లో మాత్రం జూలై 30వ తేదీన చేసుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20వ తేదీన నిర్వహిస్తుంటారు.