Delhi Gym trainer murder: ఢిల్లీలోని ద్వారకలోని పోచన్పూర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా జిమ్ ట్రైనర్ ను ఒక వ్యక్తి ఇష్టమున్నట్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
ఇటీవల కాలంలో యువకులు సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు తమ ప్రేమను రిజక్ట్ చేస్తున్న అమ్మాయిల మీద పగపెంచుకుంటున్నారు. తమకు దక్కని వాళ్లు ఇతరులకు దక్కొద్దని కూడా దారుణాలకు తెగబడుతున్నారు.
కొందరు సుపారీ గ్యాంగ్ లతో మర్డర్ లు చేయిస్తున్నారు. మరికొందరు తామే ప్రేమించిన వారిని హత్యలు సైతం చేస్తున్నారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఢిల్లీలోని పోచన్ పూర్ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది.
21 ఏళ్ల యువతి జిమ్ ట్రైనర్ గా పనిచేస్తుంది. ఆమెపై ఒక వ్యక్తి కత్తితో ఇష్టమున్నట్లు దాడికి పాల్పడ్డాడు. శనివారం సాయత్రం ఆమె ఉంటున్న ఫ్లాట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లు తెలుస్తోంది. యువతి అరుపులు విన్న చుట్టుపక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడకు చేరుకున్నారు.
అప్పటికే సదరు యువతి రక్తపు మడుగులో పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే చుట్టుపక్కల వారు ఆస్పత్రి తరలించారు. యువతిని టెస్ట్ చేసిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. దీంతో యువతి డెడ్ బాడీనీ పోస్ట్ మార్టం కోసం తరలించారు.
ఇదిలా ఉండగా.. యువతిపై దాడిచేసిన వ్యక్తిని పోలీసులు స్నేహ నాథ్ గా గుర్తించారు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని కూడా కొందరు చెప్తున్నారు. యువకుడు.. ఫ్లాట్ లోనికి ప్రవేశించి యువతితో గోడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ కాస్త పీక్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో స్నేహ నాథ్ సైకోగా మారి యువతిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నిందితుడు, చనిపోయిన యువతి ఇద్దరు కూడా అస్సాం కు చెందిన వారని తెలుస్తోంది. కాగా పదునైన ఆయుధంలో యువకుడు.. లేడీ జిమ్ ట్రైనర్ గొంతుకోసి, పలుమార్లు ఇష్టమున్నట్లు పొడిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.