Filmfare Awards 2024: నాని నుంచి కీర్తి సురేష్ వరకు.. ఈసారి ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుంది వీళ్లే..

Filmfare awards Telugu:  హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో.. నిన్న రాత్రి ఘనంగా 2024 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు జరిగాయి.  నాని చిత్రం దసరా ఈ అవార్డుల షోలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాతో పాటు బలగం, రంగమార్తాండ చిత్రాలకి కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి.. ఈ అవార్డుల గురించి పూర్తి వివరాలు మీకోసం.

1 /5

హైదరాబాదులో నిన్న ఘనంగా 69వ ఫిలింఫేర్ అవార్డులు జరిగాయి. ఈ అవార్డులో భాగంగా నాని దసరా సినిమాకి, ప్రియదర్శి బలగం చిత్రానికి.. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాకి ఎన్నో అవార్డులు వచ్చాయి. పూర్తి అవార్డుల లిస్ట్ మీకోసం..

2 /5

ఉత్తమ నటుడు: దసరా చిత్రానికి నాని, ఉత్తమ నటి: దసరా చిత్రానికి కీర్తి సురేష్,  ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ (దసరా), ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (దసరా), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దసరా చిత్రానికి అవినాష్ కొల్లా  

3 /5

ఉత్తమ చిత్రం: బలగం, ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం), ఉత్తమ సహాయ నటి: రూపా లక్ష్మి (బలగం)

4 /5

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేష్ రచించిన బేబీ, ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య బేబీ,  బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన బేబీ,  ఉత్తమ సాహిత్యం: బేబీకి అనంత శ్రీరామ్, ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీరామ చంద్ర (బేబీ)  

5 /5

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): రంగ మార్తాండ చిత్రానికి ప్రకాష్ రాజ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి నవీన్ పోలిశెట్టి, ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం రంగ మార్తాండ, రవితేజ వాల్టేర్ వీరయ్య, ఉత్తమ నూతన దర్శకుడు: శ్రీకాంత్ ఒదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్నా),; ఉత్తమ నూతన నటుడు: సంగీత్ శోబన్ (MAD)