Ganapati Decoration Ideas: వినాయక చవితి మంటపాల కోసం 5 అందమైన డెకొరేషన్ ఐడియాలు

Ganapati Decoration Ideas: రేపు దేశమంతటా గణేశ్ చతుర్ధి పండుగ జరుపుకోనున్నారు. హిందూవుల అతి ముఖ్యమైన పండుగల్లో ఇదొకటి. వినాయకుడిని స్వాగతిస్తూ చేసే పండుగ ఇది. భక్తుల ఇంటికి వినాయకుడు కొలువు దీరితే ఆ ఇంట సుఖ సంతోషాలు, సంపద వర్ధిల్లుతాయని అంటారు

Ganapati Decoration Ideas: గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 5, 7, 9, 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా గణేష్ మండపాన్ని వినూత్నంగా అందంగా అలంకరిస్తుంటారు. మీ కోసం 5 అందమైన డెకొరేషన్ ఐడియాలు

1 /5

పూవులతో రంగోలి, అలంకరణ గణేశ్ చతుర్ధి సందర్భంగా పూలకు ప్రత్యేక మహత్యం ఉంటుంది. గణేశ్ విగ్రహం చుట్టూ తాజా పూలతో ఇలా అలంకరించవచ్చు లేదా అందమైన రంగులతో రంగోలీ వేయవచ్చు. ఇలా అలంకరించడం వల్ల మీ గణేశ్ మంటపం మరింత అందంగా మారుతుంది. 

2 /5

గణేశ్ విగ్రహానికి అందమైన రంగులు గణేశుని విగ్రహాన్ని ఏదైనా మీకు నచ్చిన రంగుతో అందంగా మార్చవచ్చు. రంగులమయంగా ఉంటే ఆ ఇంట్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి

3 /5

ఈకో ఫ్రెండ్లీ డెకొరేషన్ గత కొద్దికాలంగా పర్యావరణానికి ప్రాధాన్యత పెరుగుతోంది. అదే సమయంలో ఈకో ఫ్రెండ్లీ అలంకరణ ట్రెండింగ్ అవుతోంది. గణపతిని స్వాగతించేందుకు ప్రకృతి సహజసిద్ధ వస్తువులు వెదురు, మొక్కలు, ఆకులతో అందంగా ఇలా అలంకరిస్తే బాగుంటుంది. పేపర్ ఫ్లవర్స్, పాత బట్టలు కూడా ఉపయోగించవచ్చు. 

4 /5

ధీమ్ ఆధారిత డెకొరేషన్ గణేశ్ చతుర్ది సందర్భంగా గణేశ్ మండపాన్ని అందంగా, విభిన్నంగా, అందర్నీ ఆకర్షించేలా ఉండాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకే థీమ్ ఆధారిత డెకొరేషన్ మంచి ఫలితాలనిస్తుంది. ఫారెస్ట్ థీమ్, రాజస్థాన్ థీమ్, స్వదేశీ ఇలా అందరికీ నచ్చే ఏదో ఒక థీమ్ అయితే బాగుంటుంది

5 /5

ఎల్ఈడీ లైటింగ్, దీపాలతో గణేశ్ మండపం విద్యుత్ వెలుగులతో ధగధగలాడాలానుకుంటే ఎల్ఈడీ లైటింగ్ , దీపాలు ఉపయోగించవచ్చు. రంగు రంగుల ఎల్ఈడీ లైటింగ్ గణేశ్ మంటపానికి మరింత అందాన్నిస్తుంది. ఆ ప్రాంతమంతా వెలుగులతో నిండుతుంది.