Gold Investment: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఫిజికల్ గోల్డ్ బదులు ఇలా ఇన్వెస్ట్ చేసి చూడండి

 Invest In Gold : మీరు బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే కేవలం ఫిజికల్ గోల్డ్ లో మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు అనుకున్న స్థాయిలో బంగారంపై రాబడి పొందకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారంపై మీరు పూర్తిస్థాయిలో రాబడి పొందాలనుకున్నట్లయితే, కింద పేర్కొన్న పద్ధతుల్లో బంగారంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే పెరుగుతున్న ధరలపై మీరు లాభం పొందవచ్చు.
 

1 /7

Gold Investment Plan: చాలామంది బంగారంపై పెట్టుబడి అనగానే నగల దుకాణానికి వెళ్లి ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే నిజానికి బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన మార్గం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మారిన పరిస్థితులను నేపథ్యంలో బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు ఫిజికల్ గోల్డ్ మీద కన్నా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర గోల్డ్ స్కీముల్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పూర్తిస్థాయిలో బంగారంపై లాభం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.  

2 /7

సాధారణంగా ఫిజికల్ గోల్డ్ లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు కాయిన్స్ లేదా బిస్కెట్లు కడ్డీలు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఆభరణాలు అనేవి 22 క్యారెట్ల బంగారం రూపంలో ఉంటాయి. అదే కాయిన్స్, కానీ బిస్కెట్లు కానీ కడ్డీ రూపంలో ఉన్నవి 24 క్యారెట్ల రూపంలో ఉంటాయి. వీటిని మీరు నగదుగా చేసుకోవడం అనేది కష్టమైన పని పైగా మీరు పూర్తిస్థాయిలో దీన్ని డబ్బు రూపంలోకి మార్చుకోలేరు. నగలని మార్చే సమయంలో వాటిలో తరుగు అదే విధంగా ఇతర చార్జీలను మినహాయిస్తారు.  

3 /7

ఇక బంగారంపై మీరు లాభం పొందాలంటే గోల్డ్ లోన్స్ తీసుకోవడం ద్వారా కూడా డబ్బు పొందవచ్చు. కానీ గోల్డ్ లోన్ లో మీరు 80% కన్నా ఎక్కువ మీకు లభించదు. ఆరోజు మార్కెట్ ధరకులో పూర్తి వ్యాల్యూను మీరు బంగారం పై అందుకోలేరు.  

4 /7

బంగారంలో పూర్తిస్థాయిలో లాభం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి ఫిజికల్ గోల్డ్ కు ప్రత్యామ్నాయం అంటే మీరు బాండ్ రూపంలో బంగారం విలువపై డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బాండ్లను బ్యాంకులు జారీ చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్ ధరను బట్టి ఈ బాండ్లను విడుదల చేస్తారు.  

5 /7

సావరిన్ గోల్డ్ బాండ్ లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే, పూర్తిస్థాయిలో రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఎలాంటి తరుగు అలాంటివి ఉండవు. 24 క్యారెట్ల బంగారం మార్కెట్ ధర ఎంత ఉంటుందో అంత ధర మీకు చెల్లిస్తారు. ఈ బాండ్లపై మీకు వడ్డీ కూడా లభిస్తుంది. 1 లక్ష రూపాయలకు గాను 2% వడ్డీ కూడా మీకు లభిస్తుంది. తద్వారా మీకు పూర్తి సురక్షితమైన పద్ధతిలో బంగారం రాబడిని అందుకోవచ్చు.  

6 /7

ఇక గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ల ద్వారా కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్ తరహాలో పెట్టుబడి పెట్టే వీలు లభిస్తుంది. ఇందులో మీరు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. ఇవి మార్కెట్ రేటును బట్టి మారుతూ తగ్గుతూ ఉంటాయి. బంగారం ధర పెరిగినప్పుడల్లా మీకు ఫండ్స్ రాబడిని అందిస్తాయి.

7 /7

ఇక కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా మీరు బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఫ్యూచర్స్ మార్కెట్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటి ధరలను కమోడిటీ ఎక్స్చేంజ్ నిర్ణయిస్తుంది. దీన్ని బట్టి మీరు ఫ్యూచర్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని ఆప్షన్స్ ద్వారా ట్రేడింగ్ చేస్తారు తద్వారా మీరు లాభాలను పొందవచ్చు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x