Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు

What are the benefits of gold loan: చాలా మంది ఎమర్జెన్సీ సమయంలో డబ్బు కావాలంటే లోన్ల కోసం చూస్తుంటారు. పర్సనల్ లోన్, హోంలోన్ వంటి వాటితో పోల్చి చూస్తే గోల్డ్ అనేది చాలా సులభంగా లభిస్తుంది. బ్యాంకులే కాదు ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా గోల్డ్ లోన్స్ వెంటనే ఇస్తుంటాయి. ఇక్కడ వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే మీరు కూడా గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా. అయితే లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. 
 

1 /7

Gold loan calculator: చాలా మందికి అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరం అవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో స్నేహితులు, బంధువుల దగ్గర డబ్బు చేబదులుగా అడుగుతుంటారు. అయితే వారు డబ్బు ఇవ్వకపోవడంతో బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటారు. బ్యాంకు లోన్స్ లో పర్సనల్ లోన్,  హోంలోన్ , వెహికల్ లోన్స్ వంటివి చాలానే ఉన్నాయి. 

2 /7

గతంతో పోల్చితే ఇప్పుడు ప్రాసెస్ కూడా చాలా వరకు తగ్గింది. గంటల వ్యవధిలో అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. అయితే కొన్ని రకాల లోన్లలో గోల్డ్ లోన్ చాలా ఉత్తమం అని చెప్పవచ్చు. దీని బ్యాంకులు పెద్దగా సమయం తీసుకోవు. నేటి డిజిటల్ యుగంలో ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. బంగారం ప్యూరిటీ నిర్ధారించేందుకు బ్యాంకులు లేదా ఫైనాన్సింగ్ సంస్థలు ఎగ్జిక్యూటివ్ ను ఇంటికి పంపించి ప్రాసెసింగ్ తర్వాత అరగటంలోనే లోన్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాయి. 

3 /7

అయితే ఇతర ఫైనాన్సింగ్ ఆప్షన్స్ తో పోల్చి చూస్తే గోల్డ్ లోన్ అర్హత పరిమితులు కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. ఇన్ కం ఫ్రూఫ్ అవసరం లేదు. క్రెడిట్ స్కోరుతో పనే ఉండదు. లోన్ మొత్తం బంగారం మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. దీని కోసం బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. వయసు 18 ఏళ్లుదాటి ఉండాలి. ఈ లోన్స్ ఎక్కువగా లోన్ టు వాల్యూ రేషియోను కలిగి ఉంటాయి.   

4 /7

ఆర్బిఐ ఆదేశాల ప్రకారం బంగారం వాల్యూపై 75శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. అంటే బంగారం విలువ రూ. 10లక్షలుగా ఉంటే..అందులో రూ. 7.50లక్షల వరకు తీసుకోవచ్చు. 

5 /7

చాలా బ్యాంకులు గోల్డ్ లోన్ పై ఓవర్ డ్రాఫ్టు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే లోన్ మొత్తాన్ని అదే బ్యాంకులోని ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో జమ అవుతుంది. అందులో మీరు కావాల్సిన మేరకు లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లించాలి. లోన్ టెన్యూర్ ముగుస్తున్న సమయంలో చివరిలో అసలు మొత్తం  చెల్లించాల్సి ఉంటుంది. 

6 /7

అన్ని రకాల లోన్స్ పై బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటాయి. ఇదే విధంగా గోల్డ్ లోన్స్ పై రుసుములు కూడా ఉంటాయి. ఇవి బ్యాంకులను బట్టి మారుతుంటాయి.  

7 /7

 సాధారణంగా లోన్ మొత్తంలో చాలా వరకు బ్యాంకులు 0 నుంచి 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తుంటాయి. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. రుణగ్రహిత చిరునామా, బర్త్ ప్రూఫ్ , పాన్ నెంబర్ తోపాటు రెండు పాస్ట్ పోర్టు సైజు ఫొటోలు కూడా అవసరం అవుతాయి. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x