Gold Price Today: స్థిరంగానే బంగారం ధర.. నేడు తులం ధర ఎంతుందంటే?


 Today Gold Rate : శ్రావణమాసం ముగిసిపోయింది ఇక పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి ప్రస్తుతం బంగారం ధర సెప్టెంబర్ 6 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలు ఉంది అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలు ఉంది బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూసినట్లయితే చాలా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం నిన్నటి కన్నా 10 గ్రాములపై కేవలం 50 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయని చెప్పవచ్చు.
 

1 /6

 Gold Price Today: September 6th: బంగారం ధరలు అంతర్జాతీయంగా గమనించినట్లయితే పెరుగుదలను సూచిస్తున్నాయి. అమెరికాలో కీలకమైన జాబ్స్ డేటా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో గ్లోబల్ మార్కెట్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జాబ్ డేటా ఆధారంగానే అమెరికా ఆర్థిక మాంద్యం వైపు వెళుతుందా లేదా అనే సంగతి బయటపడుతుంది. 

2 /6

ఒకవేళ జాబ్స్ డేటా నెగిటివ్ గా ఉంటే మాత్రం బంగారం ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీ త్వరలో కానుంది. వడ్డీరేట్లపై పావు శాతం మేర కోత విధిస్తుందని వార్తలు కూడా బంగారం ధరలు పెరుగుదలను సూచిస్తున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లు పతనం అయినప్పుడల్లా బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా గుర్తిస్తుంటారు.   

3 /6

బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి పసిడి ఆల్ టైం గరిష్ట స్థాయి 75000 మార్కును దాటుతుందనే అంచనాలు వెలబడుతున్నాయి. అయితే రాబోయే ఫెస్టివల్ సీజన్ అంటే దసరా, దీపావళి సందర్భంగా బంగారం ధరలు అత్యధిక స్థాయిని తాకే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది, దీంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. అయితే నిపుణులు మాత్రం ధర తగ్గినప్పుడల్లా బంగారం కొనుగోలు చేయమని సూచిస్తున్నారు. 

4 /6

బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మీరు నగల షాపింగ్ కనుక చేస్తున్నట్లయితే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గ్రామంలో తేడా కనిపించిన మీరు పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. బంగారం స్వచ్ఛతను సాధారణంగా క్యారెట్లలో కొలుస్తుంటారు 24 క్యారెట్ల బంగారాన్ని మేలు మీ బంగారం అంటారు అదే సమయంలో 22 క్యారెట్ల బంగారాన్ని ఆర్నమెంట్ బంగారం అంటారు.

5 /6

 మనకు మార్కెట్లో లభించే ఆభరణాలన్నీ కూడా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారంతో తయారుచేస్తారు ఈ రెండింటి ధర మధ్య  కూడా చాలా తేడా ఉంటుంది. మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తరుగు అదే విధంగా మజూరి చార్జీలు కూడా కలిపి ఉంటాయి వీటిని గమనించాల్సి ఉంటుంది అలాగే జీఎస్టీ కూడా అదనంగా ఉంటుందని గమనించాలి.  

6 /6

 బంగారం కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్క్ అనేది తప్పనిసరి ఎంత చిన్న నగ పైన అయినా హాల్ మార్క్ ఉంటేనే కొనుగోలు చేయాలి లేకపోతే కొనకూడదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే విక్రయించాలని చట్టం చేసింది.