Gold News: బంగారం తగ్గుతుందని మురిసిపోతున్న పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. కొన్నాళ్ల క్రితం 84వేల మార్క్ తాకిన బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అమెరికాలో ట్రంప్ గెలవడంతో కాస్త తగ్గిన బంగారం..భవిష్యత్తులో కూడా భారీగా తగ్గుతుందని అంతా అంచనా వేసారు. కానీ ఓ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడించింది. భవిష్యత్తులో బంగారాన్ని ముట్టుకోవడం కూడా కష్టమేనని భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి 19 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరి బంగారం ధర ఏమేరకు పెరగనుంది..భారత్ లో తులం ధర ఎంత ఉండనుందో తెలుసుకుందాం.
Gold News: బంగారం ధర భగభగమంటోంది. స్వల్పంగా తగ్గితే..భారీగా తగ్గిందంటూ సంతోషపడుతున్నారు పసిడి ప్రియులు. ఎందుకంటే దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. అయితే కొన్నాళ్ల క్రితం 84వేల మార్క్ తాకిన బంగారం ధర నెమ్మదిగా తగ్గింది. అయితే భారీగా తగ్గనప్పటికి ప్రస్తుతం తులం ధర 77 వేలు ఉంది. 24క్యారెట్లు అయితే 79వేలు ఉంది. ఈ క్రమంలో బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా తగ్గుతాయనుకున్న వారికి ఓ నివేదిక షాకింగ్ న్యూస్ చెప్పింది. భవిష్యత్ అంతా బంగారందేనని..భారీగా పెరగడం ఖాయమని రిపోర్టులో పేర్కొంది. వచ్చే ఏడాది చివరికల్లా 19శాతం పెరుగుతుందని తెలిపింది.
వచ్చే ఏడాది ఇంకా భారీగానే పెరిగే ఛాన్స్ ఉందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ పెట్టుబడుల సేవల సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. వచ్చే సంవత్సరం చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 3150 డాలర్లకు చేరుకునే ఛాన్స్ ఉందని తెలిపింది. అంటే ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్లు గ్రాముకు మన దేశంలో 8,553చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూప. 85వేలు దాటిపోతుందని చెబుతోంది.
అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 2650 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ అవుతోంది. ఆదివారం 24క్యారెట్ల పసిడి ధర గ్రాము 79,00వద్ద ఉంది. స్వల్ప మధ్య కాలంలో మేలిమి బంగారం ధర రూ. 7,500కు చేరొచ్చని విక్రేతలు అంచనా వేస్తున్నా..దీర్ఘకాలంలో మాత్రం బంగారం ధరలు భారీగానే పెరుగుతాయని చెబుతున్నారు.
పలు దేశాల మధ్య ఉద్రిక్తలు, యుద్దాలు బంగారం గిరాకీకి ప్రధాన కారణంగా అవ్వగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడమూ ధర పెరిగేందుకు దోహదపడుతుందని ఈ సంస్థ విశ్లేషించింది.
అయితే మరో సంస్థ యూబీఎస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఔన్సు బంగారం ధర వచ్చే నెలలో 2,900 డాలర్లకు వచ్చే ఏడాదికి 3000 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయి కంటే బంగారం ధర మరీ కిందకు దిగే ఛాన్స్తక్కువగా ఉన్నట్లు వివరించింది.
ముడి చమురు కూడా బంగారం బాటలోనే పయనించే అవకాశం ఉందని గోల్డ్ మ్యాన్ శాక్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లోబ్యారెల్ చమురు ధర ప్రస్తుతం 70 డాలర్ల స్థాయిలో ఉంది. 70 నుంచి 85 డాలర్ల శ్రేణిలో ఎక్కువగా కాలం ఉంటుందని కానీ వచ్చే ఏడాదిలో 100 డాలర్లకు పెరిగే ఛాన్స్ లేకపోలేదని సంస్థ పేర్కొంది. కానీ 2026లో చమురు బ్యారెల్ ధర మళ్లీ 61-64 డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషించింది.