Gold Rate Today: ఏందక్కా..బంగారం ధరలు గిట్ల పెరుగుతున్నాయి.. కొత్త సంవత్సరంలో షాకిస్తున్న పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగిన గోల్డ్

Gold Rate Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓసారి ధరలను తెలుసుకోండి. ఎందుకంటే గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏ మేరకు బంగారం, వెండి ధరలు పెరిగాయే ఇప్పుడు తెలుసుకుందాం.

1 /8

Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి.  కొత్త ఏడాది మూడో రోజు బంగారం ధర 330 రూపాయలు పెరిగింది. నేడు   శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 330 పెరిగింది. 

2 /8

దేశంలోని చాలా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 78,400 చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర  71,900పలుకుతుంది.  ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు కిలో వెండి ధర 90, 400 రూపాయలకు చేరుకుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం  ఇవే ధరలు కొనసాగుతున్నాయి.  

3 /8

 అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పెరగడం దేశం మార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రూపాయి బలహీనత అంతర్జాతీయ మార్కెట్లో బలపడడం బంగారం ధరలకు మరింత మద్దతు ఇచ్చాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

4 /8

కామిక్స్ మార్కెట్లో కూడా గోల్డ్ ఔన్స్ 2064 పైన ట్రేడ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరగవచ్చు అని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

5 /8

బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ఐఎస్ఓ ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైంది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 22 క్యారెట్ల బంగారంలో తొమ్మిది శాతం కలిపి ఆభరణాలుగా తయారు చేస్తారు.

6 /8

24 క్యారెట్ల బంగారం విలాసవంతమైంది. అయినప్పటికీ దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించలేరు. అందుకే చాలామంది దుకాణం దారులు 22 క్యారెట్ల బంగారంను విక్రయిస్తుంటారు.   

7 /8

అయితే కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని అంతా భావించారు. కానీ బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు మరోసారి ఇన్వెస్ట్ దారుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా ఆర్థిక గణాంకాలే అని చెప్పవచ్చు.డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు ఈ నెలలోనే చేపట్టబోతున్నారు.

8 /8

ఈనేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయని భావించినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం అని చెప్పవచ్చు. సెంట్రల్ బ్యాంకులు ఒకవేళ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే బంగారం ధర లక్ష రూపాయలు దాటడం ఖాయం అనిపిస్తుంది.