Today Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Today Gold Rate: బంగారం ధరలో శుక్రవారం భారీ పతనం కనిపించింది. నేడు పసిడి ధర దాదాపు 300 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..76,650 రూపాయలుగా నమోదు అయ్యింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,240 రూపాయలుగా నమోదు అయ్యింది.
అయితే గడచిన వారం రోజులుగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ బంగారం ధర భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప రిలీఫ్ అందిస్తున్నాయి. అయితే ఈ నెల చివర్లో దన త్రయోదశి పండుగ ఉంది అలాగే దీపావళి పండగ కూడా ఉంది.
ఈ సీజన్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. పసిడి ధరలు పెరగడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను పేర్కొనవచ్చు. ప్రస్తుతం అమెరికాలో బంగారం ధర ఒక ఔన్సు 2700 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది.
దీంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం వాతావరణం ఇంకా సమసి పోలేదు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇది ప్రపంచ వాణిజ్య మార్కెట్ల పైన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లలో సైతం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారు వైపు తరలిస్తారు. ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం.
ఇందులో పెట్టుబడి పెడితే పెద్దగా నష్టం రాదు. అలా అని భావించే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఏర్పడి భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి సమీపంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇలా పెరిగినట్లయితే బంగారం ధర ఈనెల చివరినాటికి 85000 చేరే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు.