Central Government Pension Hike Updates: కొత్త ఏడాదిలో పెన్షనర్లకు కేంద్రం నుంచి రానుంది. పెన్షనర్ల వయసును బట్టి పింఛన్ పెంచాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సిఫారసు చేసింది. 65 ఏళ్ల వయసులో 5 శాతం, 70 ఏళ్లలో 10 శాతం, 75 ఏళ్లలో 15 శాతం, 80 ఏళ్ల వయసులో 20 శాతం చొప్పున పింఛను పెంచాలని సూచించింది. కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ రానుంది.
కేంద్ర పెన్షన్‌దారులకు మరింత ఆర్థిక భరోసా కల్పించే దిశగా జేపీసీ కీలక సిఫార్సులు చేసింది. వయసు పెరిగిన కొద్ది అధిక పెన్షన్ అందజేయాలని సూచించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 80 ఏళ్ల వయస్సు తర్వాత పెన్షన్ 20 శాతం పెరుగుతోంది. అయితే వృద్దాప్యంలో అంటే 65 నుంచి 75 సంవత్సరాల వయస్సులో డబ్బు ఎక్కువగా అవసరం అవుతోంది. దీంతో 80 ఏళ్ల దాటిన తరువాత పెన్షన్ పెంపుతో పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు.
ఇక రిటైర్మెంట్ అయిన వారిలో ఎక్కువ మంది 70 నుంచి 80 ఏళ్ల మధ్య మరణిస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. దీంతో 65 ఏళ్ల నుంచే పెన్షన్ పెంచితే.. మరింత లబ్ధి చేకూరనుంది.
అంతేకాకుండా ప్రతి ఏడాది ఒక శాతం పెంచాలని జేపీసీ ప్రతిపాదనలు పంపించింది. ప్రతి ఏడాది పెన్షన్ పెంచితే.. పింఛన్‌దారులు ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొంది.
ఈ ప్రతిపాదనలపై పింఛన్‌దారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయం తీసుకుంటే పెన్షన్‌దారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.
ఈ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని ఎంపీ పెన్నీ బెహనాన్ కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిని రిక్వెస్ట్ చేశారు. లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు పెన్షన్ పెంపుతో ప్రయోజనం పొందుతారని అన్నారు.
కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. పెన్షన్‌దారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.