Gratuity Calculator: బడ్జెట్‌లో గ్రాట్యుటీపై కేంద్రం అదిరిపోయే ప్రకటన..! గ్రీన్‌సిగ్నల్ వస్తే ఉద్యోగులకు పండగే..

Gratuity Calculation Rules: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బడ్జెట్ కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు తమ డిమాండ్స్‌ను పంపించాయి. మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఐదేళ్లు కంటిన్యూగా పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ లేదా కంపెనీకి రాజీనామా చేసే ఉద్యోగుల గ్రాట్యుటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
 

1 /8

ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌ నాయకులు గ్రాట్యుటీ గణన నిబంధనలపై చర్చించాయి. కార్మికులు, ఉద్యోగులు పదవీ విరమణపై ఎక్కువ గ్రాట్యుటీని పొందేలా మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు.  

2 /8

బడ్జెట్‌ ప్రసంగానికి ముందు కేంద్ర కార్మిక సంఘాలు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి అందజేశాయి. కార్మికులు, ఉద్యోగులు పదవీ విరమణపై ఎక్కువ గ్రాట్యుటీ పొందేందుకు వీలుగా గ్రాట్యుటీ చెల్లింపులను 15 రోజుల జీతానికి బదులుగా ఒక నెల జీతానికి పెంచాలని కోరారు.  

3 /8

అంతేకాకుండా గ్రాట్యుటీ చెల్లింపు కోసం రూ.20 లక్షల లిమిట్‌ను తొలగించాలని కోరారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. గ్రాట్యుటీ చెల్లింపు గరిష్ట పరిమితి రూ.20 లక్షలుగా ఉంది. ఈ మొత్తంపై ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.  

4 /8

గ్రాట్యుటీ అంటే.. ఉద్యోగులు కంపెనీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఇచ్చే మొత్తం. ఒక ఉద్యోగి పదవీ విరమణ లేదా ఒక కంపెనీలో కంటిన్యూగా ఐదేళ్లు పనిచేసిన తరువాత గ్రాట్యూటీ పొందేందుకు అర్హులు అవుతారు.  

5 /8

గ్రాట్యుటీ ఏ ఉద్యోగి శాలరీలో భాగం కాదు. కంపెనీకి రాజీనామా చేసి వెళ్లిపోయినప్పుడు ఒకేసారి కంపెనీ చెల్లిస్తుంది. ఉద్యోగి లేదా కార్మికుల జీతం ఆధారంగా గ్రాట్యూటీని లెక్కిస్తారు.  

6 /8

కంపెనీ పాలసీ ప్రకారం.. ప్రతి ఉద్యోగికి విడిగా గ్రాట్యూటీని నిర్ణయిస్తారు. గ్రాట్యుటీని పొందడానికి.. ఏదైనా కంపెనీలో కనీసం వరుసగా ఐదేళ్లు పనిచేయాలి. అయితే ఉద్యోగి మరణించినా.. లేదా వైకల్యం విషయంలో ఈ నిబంధనలు వర్తించదు.   

7 /8

గ్రాట్యుటీని లెక్కించేందుకు ఏడాదిలో 240 రోజులు పని దినాలుగా  లెక్కిస్తారు. (15 x గత నెల జీతం x మొత్తం సర్వీస్ సంవత్సరాల సంఖ్య)/26.  

8 /8

15 రోజుల జీతం ఆధారంగా గ్రాట్యుటీ చెల్లిస్తారు. చివరి నెల జీతంలో డీఏతో పాటు బేసిక్ శాలరీ కూడా ఉంటుంది. 26 అంటే నాలుగు ఆదివారాలు చేర్చని నెలలోని 30 రోజులను తీసుకుంటారు.