UPI Limit Increase: ప్రజలకు గుడ్‌న్యూస్‌.. యూపీఐ పేమెంట్‌ లిమిట్‌ రూ.5 లక్షలకు పెంపు

UPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్‌ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్‌ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది. పెరిగిన లిమిట్‌ ఎంత, సాధారణ పేమెంట్లకు కూడా లిమిట్‌ పెరిగిందా అనేవి తెలుసుకోండి.

1 /7

UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్ల లిమిట్‌ రిజర్వ్ బ్యాంక్ పెంచింది. అయితే పెరిగిన లిమిట్ అన్ని పేమెంట్లకు కాదు. పెరిగిన లిమిట్‌ ఎంత, సాధారణ పేమెంట్లకు పెరిగిందా అనేవి తెలుసుకోండి.

2 /7

UPI Payment Limit Increase: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ యూపీఐ పేమెంట్లపై శుభవార్త వినిపించింది.

3 /7

UPI Payment Limit Increase: తాజాగా జరిగిన పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక ప్రకటన చేశారు.

4 /7

UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్ల లావాదేవీ లిమిట్‌ను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

5 /7

UPI Payment Limit Increase: అయితే పెంచిన లిమిట్‌ సాధారణ పేమెంట్లకు కాదు. కేవలం పన్ను చెల్లింపులకు మాత్రమే యూపీఐ లిమిట్‌ను పెంచినట్లు గవర్నర్‌ తెలిపారు. పన్ను చెల్లింపులు బకాయి పడకుండా వెంటనే చెల్లింపులు అయ్యేలా ఆర్‌బీఐ యూపీఐ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచింది.

6 /7

UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్లు క్యాపిటల్‌ మార్కెట్లు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్స్‌, రుణ చెల్లింపులు, బీమా, వైద్య, విద్యాపరమైన సర్వీసులకు లిమిట్‌ అనేది ఒక్కో రీతిలో ఉంటుంది.

7 /7

యూపీఐ పేమెంట్ల లిమిట్‌ ఇలా రూ.5 లక్షలు: పబ్లిక్‌ ఆఫర్‌, రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌, పన్ను చెల్లింపులు రూ.2 లక్షలు: క్యాపిటల్‌ మార్కెట్లు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్స్‌, ఫారిన్‌ ఇన్‌వార్డ్‌ రెమిటెన్సెస్‌ తదితర సేవలు రూ.1 లక్ష: సాధారణ పేమెంట్ల లిమిట్‌. ఈ లిమిట్‌ పెంచే యోచనలో ఆర్‌బీఐ లేదు