Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతికి ముందే ఈ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు..

Hanuman Jayanti 2024 3 Lucky Zodiac Signs: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే హనుమాన్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది అయితే ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభించబోతున్నాయి.


Hanuman Jayanti 2024 3 Lucky Zodiac Signs: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకొని పండగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. ఈ పండగను ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది. ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడిని పూజించి ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు.
 

1 /6

అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడుని కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో పూజించడం వల్ల మనసులో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోయి. ధైర్యం శక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే చాలామంది ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని దర్శించుకుంటారు.

2 /6

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన హనుమాన్ జయంతికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన కొన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఈ జయంతి ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

3 /6

హనుమాన్ జయంతి రోజు ఏర్పడే ప్రత్యేకమైన యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని, అలాగే శని దేవుడి ప్రభావం నుంచి కూడా విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

4 /6

కర్కాటక రాశి వారికి హనుమాన్ జయంతి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు కొత్త పనులను ప్రారంభించడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. దీంతోపాటు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు.  

5 /6

హనుమాన్ జయంతి రోజు వృశ్చిక రాశి వారికి కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు కొత్త ఇల్లుతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి మతపరమైన కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మనశ్శాంతి కూడా పెరుగుతుంది.  

6 /6

కుంభ రాశి వారికి కూడా హనుమాన్ జయంతి రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి హనుమంతుడి అనుగ్రహం లభించి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా పొందుతారు. దీంతో పాటు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.