Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..

Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.

1 /8

ప్రస్తుతం దేశంలో శరన్నావరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ తల్లి తొమ్మిది రోజుల పాటు, ఆయా అవతారాలలో భక్తుల్ని అనుగ్రహిస్తుంటారు. ఈ తొమ్మిదిరోజులలో కూడా భక్తితో పూజలు సైతం చేస్తారు.

2 /8

 శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 3 నుంచి అక్టోబరు 12 వరకు కొనసాగుతున్నాయి. అయితే.. అక్టోబరు 12న దసరాను జరుపుకుంటాం. దుర్గముడు అనే రాక్షసుడిని అమ్మవారి సంహారించారని చెప్తుంటారు.

3 /8

చెడుపై మంచి గెలిచింనందుకు గాను ఈరోజు దుర్గ నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అయితే.. దసరా రోజున ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మరోకరు మంచి జరగాలని కోరుకుంటారు. దసరాను ఎంతో గ్రాండ్ గా కూడా జరుపుకుంటారు.

4 /8

దసరా రోజున వాట్సాప్, మెస్సెజ్ ల రూపంలో తమ ప్రియమైన వారికి బంధువులకు, స్నేహితులకు సందేశాలు పంపించుకుంటారు. దీని వల్ల ఒక మంచి వాతావారణం, ఆప్యాయతలు ఏర్పడతాయని చెబుతుంటారు.  కొన్ని మంచి వాట్సాప్,మెస్సెజ్ సందేశాలు ఈ కింద ఇవ్వబడ్డాయి.  

5 /8

దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మీ కుటుంబంపైన ఎల్లవేళల ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దసరా 2024 .. మీరు చేయబోయే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి.

6 /8

నవదుర్గల ఆశీర్వాదం మీకు ఎల్లవేళల ఉండాలని కోరుకుంటూ.. దసరా పండుగ  శుభాకాంక్షలు 2024. మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారంలో మంచి డెవలప్ మెంట్ ఉండాలని కోరుతూ దసరా  శుభాకాంక్షలు.. 

7 /8

 చెడుపై మంచి గెలిచినందుకు దసరా పండుగ చేసుకుంటాం. అలాంటి ఈరోజు నుంచి మీకు అన్ని విధాలుగా కలిసి రావాలని దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ దసరా  శుభాకాంక్షలు.

8 /8

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళల ఆ చల్లని తల్లి చూపు ఉండాలని కోరుకుంటూ దుర్గమ్మ తల్లి మీకు అన్ని రకాలుగా ఉన్నతిని ఇవ్వాలని కోరుకుంటూ దసరా పండుగ  శుభాకాంక్షలు..