Happy Makar Sankranti 2024: సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, కోట్స్‌ మీ కోసం..షేర్‌ చేయండి ఇలా..

Happy Makar Sankranti Wishes In Telugu 2024: తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పండగను మీ కుటుంబ సభ్యులకు ఆనందంగా జరుపుకోవడం ఎంతో అదృష్టం. అయితే ఇంటికి దూరంగా స్నేహితులకు దూరంగా ఉన్నవారు మేమందించే ఈ ప్రత్యేకమైన కోట్స్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేయండి..
 

Happy Makar Sankranti Wishes In Telugu 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ మూడు రోజుల పండగలో భాగంగా ప్రతి ఇల్లు కుటుంబ సభ్యులతో కొత్త శోభన సంతరించుకున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పుణ్యదినం రోజునే తెలుగు ప్రజలంతా ఎంతో సంతోషంతో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ పండగ రోజు ముత్యాల ముగ్గులు, సన్నాయి చప్పుడు, గంగిరెద్దుల మువ్వల సవ్వళ్లు, పతంగుల ఆటలతో ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. 
 

1 /8

మరిచిపోని ఆనందాన్ని ఇచ్చే భోగి పండుగ.. జీవితానికి సరిపోయే సరదానిచ్చే సంక్రాంతి.. నోటికి కమ్మని పిండివంటలను అందించే కనుమ..ఇవన్నీ ఈ కొత్త సంవత్సరంలో మీకు కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు.  

2 /8

ఈ పండగ తెలుగు రాష్ట్రాల ప్రజల కొత్త జీవితాలకి కొత్త ఆరంభం కావాలని మనసారా సూర్య భగవానుడిని కోరుకుంటూ మీకు, మీ శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

3 /8

మీ జీవితంలో ఈ సంక్రాంతి సరికొత్త అనుభూతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులందరికీ..మకర సంక్రాంతి శుభాకాంక్షలు.  

4 /8

ఈ కొత్త సంవత్సరంలోని మీ జర్నీలో అన్నీ అనుకూలంగా సాగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ..హ్యాపీ పొంగల్..

5 /8

ఈ మకర సంక్రాంతి పండగ మీ జీవితంలో ఎన్నో ఆనందపు అనుభూతులను అందించాలని ఆ శ్రీమహావిష్ణువును కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

6 /8

మకర సంక్రాంతి పూట ఆ సూర్యుడికిరణాలు మీ జీవితంలో వెలుగును నింపాలని మనసారా కోరుకుంటూ.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

7 /8

కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండగ మీ జీవితంలో సిరుసంపదలను తీసుకురావాలని మనసారా ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి ప్రత్యేక శుభాకాంక్షలు.

8 /8

ఈ సంక్రాంతి పూట మీలో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల శక్తిని నింపాలని ఆ సూర్యభగవానుడిని ప్రార్థిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు..