Health benefits of Amla: ఒక్క ఉసిరిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా ?

శీతాకాలంలో కార్తీక మాసంలో విరివిగా దొరికే ఉసిరి కాయలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకొని రోజు మీరు ట్రై చేయండి మరి.

  • Nov 29, 2020, 00:52 AM IST

Amla health benefits: ఆమ్లాలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

1 /6

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ( Immunity booster ) శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఎంతో సహాయపడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే ఇన్ ఫెక్షన్స్ కి చెక్ పెట్టడానికి ఉసిరి ఎంతో సహాయపడుతుంది.

2 /6

శీతాకాలంలో అధికం అయ్యే కీళ్ళ నొప్పులను నివారించవచ్చు ( Best solution for joint pains ) ఉసిరిలో కీళ్ళ నొప్పులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఉసిరి తీసుకోవడం వల్ల శీతాకాలంలో అధికం అయ్యే కీళ్ళ నొప్పులను అదిగమించవచ్చు.

3 /6

చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు మెరిసేలా చేస్తుంది ( Best solution for hair loss, dandruff issues  ) ఉసిరి.. చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే చిన్న వయస్సులో జుట్టు తెల్లబడడం, నెరవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఉసిరి షాంపూ, కండీషనర్, హెయిర్ ఆయిల్ వాడడం వల్ల బలమైన, మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

4 /6

కంటి చూపుని మెరుగుపరుస్తుంది ( Amla improves Eyesight ) ఉసిరిలోని కెరోటిన్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కళ్ళపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కంట్లోంచి నీరు కారే సమస్యను నివారించే గుణాలు ఉసిరి సొంతం  

5 /6

మలబద్ధకాన్ని నివారిస్తుంది  ( Best solution for constipation problem ) ఉసిరి నాచురల్‌గా దొరికే ఆల్కలీన్. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

6 /6

విటమిన్ సి రక్త నాళాలను బలంగా చేస్తుంది ( Oxidative stress ) ఉసిరిలోని విటమిన్ సి రక్త నాళాలను బలంగా చేస్తుంది. అలాగే డిటాక్సిఫికేషన్‌కి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.