Health Remedies: ఆవనూనెకు ఆరోగ్యపరంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యానికి, కేశాలకు చాలా ప్రయోజనకరం. ఆవనూనె రాయడం వల్ల కొన్ని నొప్పులు కూడా తగ్గిపోతాయి. కారణం ఇందులో ఉండే పోషకాలు. ఆవనూనెలో కొన్ని పదార్ధాలు కలిపి రాయడం వల్ల చాలా సమస్యల్నించి విముక్తి పొందవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
ఆవనూనె-ఫిట్కరీ ఆవనూనెలో ఫిట్కరీ కలిపి రాస్తే తల దురద, మంట, ఎలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆవనూనె-ఉసిరి ఆవనూనెలో ఉసిరి కలిపి కేశాలకు రాయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య చాలా వరకూ తగ్గుతుంది. కేశాలకు ఇది చాలా ప్రయోజనకరం.
ఆవనూనె-పెరుగు ఆవనూనెలో పెరుగు కలిపి రాయడం వల్ల డేండ్రఫ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
ఆవనూనె-అలోవెరా జెల్ ఆవనూనెలో అల్లోవెరా జెల్ కలిపి కేశాలకు రాయడం వల్ల జుట్టుకు అద్భుతమైన నిగారింపు వస్తుంది. కేశాలు నల్లగా నిగనిగలాడుతుంటాయి. వారంలో రెండుసార్లు రాస్తే చాలు.
ఆవనూనె-కర్పూరం ఆవనూనెలో కర్పూరం కలిపి శరీరానికి రాయడం వల్ల జలుబు, జ్వరం చాలా వరకూ తగ్గిపోతాయి. ఛాతీపై, వీపు భాగంలో రాయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.