HDL Cholesterol: కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే రెండవది చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ అనేది రక్త వాహికల్లో పేరుకుని గుండె వ్యాధుల ముప్పును పెంచుతుంది. అదే గుడ్ కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి కాపాడుతుంది. శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెంచే ఐదు ఆహార పదార్ధాలేంటో తెలుసుకుందాం..
అవకాడో అవకాడోలో హెల్తీ ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ పెంపుకు దోహదపడతాయి.
పండ్లు కూరగాయలు పండ్లు కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆపిల్, ద్రాక్ష, బ్లూబెర్రీ, బ్రోకలీ, పాలకూర వంటివాటితో శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఫ్యాటీ ఫిష్ సాల్మన్, ట్యూనా, మ్యాక్రెల్, సార్డిన్ వంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా గుడ్ కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది.
నట్స్ అండ్ సీడ్స్ బాదం, వాల్నట్స్, ఫ్లక్స్ సీడ్స్, చియా సీడ్స్‌లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధికంగా ఉడటం వల్ల హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఓట్స్ ఓట్స్‌లో లిక్విఫైడ్ ఫైబర్ అధికగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు దోహదం చేస్తుంది.
Next Gallery