Winter Health Tips: శీతాకాలంలో గుండె వ్యాధుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ చలికారణంగా నరాలు కుదించుకుపోతుంటాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఇది కాస్తా హార్ట్ ఎటాక్ లేదా హార్ట్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని సూచనలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
బ్లడ్ ప్రెషర్ చెకింగ్ రక్తపోటు అనేది నేరుగా గుండెతో సంబంధమున్న సమస్య. చలికాలంలో రక్తపోటు ప్రభావితమౌతుంటుంది. ఇంట్లో బ్లడ్ ప్రెషర్ మెషీన్‌తో ఎప్పటికప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తుండాలి.
హైడ్రైట్‌గా ఉండటం శరీరంలో నీటి కొరత అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. సీజన్ ఎలా ఉన్నా సరే నీళ్లు తాగడం మర్చిపోకూడదు. రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది.
హెల్తీ డైట్ చలికాలంలో శరీరానికి అధిక పోషకాలుండే ఆహారం అవసరమౌతుంది. వాతావరణం చల్లగా ఉన్నా సరే బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తప్పకుండా ఉండాలి. సాల్ట్, శాచ్యురేటెడ్ ఫ్యాట్, రిఫైండ్ షుగర్ వంటివి తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. పోషకాలతో నిండిన ఆహారం డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.
వెచ్చని దుస్తులు ధరించాలి చలి ప్రదేశాల్లో ఉండేవాళ్లైతే వ్యాయామం చేసేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు వెచ్చగా ఉండే దుస్తులు ధరించాల్సి ఉంటుంది. శరీరాన్ని సాధ్యమైనంత వరకూ వెచ్చగా ఉంచాలి. చలికి బాడీ ఎక్స్‌పోజ్ కాకూడదు.
ఇంట్లో యాక్టివ్‌గా ఉండటం చలికాలంలో గుండె ఆరోగ్యం కోసం శారీరక శ్రమ ఉండేట్టు చూసుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న వ్యాయామ ప్రక్రియలు అవలంభిస్తుండాలి. ఆన్‌లైన్ యోగా తరగతులు అవలర్చుకుంటే మంచిది. రక్త సరఫరా మెరుగుపర్చేందుకు రక్తపోటు తగ్గించేందుకు, కార్డియో వాస్క్యులర్ ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఇది అవసరం.