Heart-Health Foods: గుండె ఆరోగ్యానికి దోహదం చేసే టాప్ 5 ఆహార పదార్ధాలు, హార్ట్ ఎటాక్ సైతం దూరం

మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగం గుండె. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరఫరా అయ్యేది గుండె ద్వారానే. ఆక్సిజన్ సహా అవసరమైన పోషకాల్ని అన్ని అంగాలకు చేరవేస్తుంది. అందుకే గుండెను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోవాలి. గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యంగా లేకుంటే ప్రమాదకర పరిస్థితి ఎదురుకావచ్చు. అందుకే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ఆహార పదార్ధాలు తప్పకుండా డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.

Heart-Health Foods: మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగం గుండె. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరఫరా అయ్యేది గుండె ద్వారానే. ఆక్సిజన్ సహా అవసరమైన పోషకాల్ని అన్ని అంగాలకు చేరవేస్తుంది. అందుకే గుండెను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోవాలి. గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యంగా లేకుంటే ప్రమాదకర పరిస్థితి ఎదురుకావచ్చు. అందుకే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ఆహార పదార్ధాలు తప్పకుండా డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.

1 /5

పెరుగు పెరుగులో ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కండరాల్ని బలోపేతం చేస్తుంది. కాల్షియం ఎముకలు, దంతాల్ని పటిష్టం చేస్తుంది. ఇక పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

2 /5

చేపలు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావల్సినంతగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.

3 /5

నట్స్ అండ్ బీన్స్ ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడుతుంది.  గుండె రోగాల ముప్పును తగ్గిస్తుంది. 

4 /5

తృణధాన్యాలు తృణధాన్యాల్లో పెద్దఎత్తున ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో దోహదం చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తృణధాన్యాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజువారీ డైట్‌లో తృణధాన్యాలు ఉండేట్టు చూసుకోవాలి.

5 /5

పండ్లు కూరగాయలు పండ్లు-కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి. పండ్లు-కూరగాయల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. రోజూ ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.