Health Tips: చలికాలంలో ఎప్పుడూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. అంతేకాకుండా శరీరంలో ఎనర్జీ తగ్గిపోతుంది. అందుకే ఈ సమయంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్ధాలు తీసుకోవాలి.
చలికాలంలో నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు దూరమౌతాయి. శరీరానికి కావల్సినంత ఎనర్జీ లభిస్తుంది.
చిలకడదుంప శీతాకాలంలో విరివిగా లభిస్తోంది. ఇందులో పోషకాలు చాలా ఎక్కువ. చలికాలంలో చిలకడదుంప వినియోగంతో చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి.
అల్లం తులసి మిశ్రమంతో చలికాలంలో కాడా తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ రకాల వ్యాధుల దూరమౌతాయి.
చలికాలంలో తేనె వినియోగం చాలా మంచిది. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యల్నించి విముక్తి కల్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు అందిస్తుంది.
పసుపులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫైబర్, కాపర్, జింక్, ఫాస్పరస్తో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి చాలా ఉంటాయి. అందుకే పసుపును చలికాలంలో ఉపయోగించడం వల్ల చాలా వ్యాధుల దూరమౌతాయి.
చలికాలంలో చాలా రకాల కూరగాయలు లభ్యమౌతుంటాయి. మార్కెట్లో ఆకుపచ్చ కాయగూరలు, ఆకు కూరలు చాలా లభిస్తాయి. పాలకూర, మెంతి కూర, తోటకూర వంటివి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ చాలా వేగంగా పెరుగుతుంది.
బెల్లం వినియోగం చలికాలంలో చాలా మంచిది. బెల్లం అనేది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. దాంతోపాటు రక్తాన్ని శుభ్రం చేసి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. బెల్లం తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
డిసెంబర్ నెల ప్రారంభమైపోయింది. చలి తీవ్రత పెరిగిపోతోంది. చలిగాలులు, చలి నుంచి కాపాడుకునేందుకు వేడి దుస్తులు ధరించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆహార పదార్ధాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. డైట్లో కొన్ని మార్పులు తప్పకుండా చేయాలి.