Hero Shivaji: బుల్లితెరపై సరికొత్త పాత్రలో హీరో శివాజీ ఎంట్రీ.. ఈసారి అంతకుమించి..!

Hero Shivaji TV Show: బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన హీరో శివాజీ.. 90s వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈటీవీ విన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వగా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ భారీగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ సిరీస్‌లో ఉపాధ్యాయుడి పాత్రలో శివాజీ నటించారు. ఇందులో డైలాగ్స్, స్టోరీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో మరోసారి శివాజీ టైమ్‌లైన్‌లోకి వచ్చారు. ఇక త్వరలో ఓ షోకు జడ్జిగా రానున్నారు.
 

1 /5

హీరో శివాజీ సరికొత్త పాత్రలో బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈటీవీలో ఓ కామెడీ షోకు జడ్జిగా రానున్నారు.  

2 /5

అయితే ఆయన ఏ షోకు న్యాయనిర్ణేతగా రాబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు.   

3 /5

బిగ్‌బాస్‌ హౌస్‌లో శివాజీ తన ఆటతీరు ఆకట్టుకున్నారు. విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు వెన్నంటే ఉన్నారు.  

4 /5

గేమ్ చివరి వరకు అన్నదమ్ములా కలిసి ఉన్నారు. శివాజీ మూడోస్థానంలో నిలిచినా.. పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంతో చాలా సంతోషడ్డారు.  

5 /5

బిగ్‌బాస్ షో తరువాత 90s వెబ్ సిరీస్‌తో మళ్లీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై ఏ షో ద్వారా శివాజీ అలరిస్తారో చూడాలి మరి.