Hair Problems: చింతపండును తీసిపారేయకండి.. జుట్టు సమస్యలను పారదోలుతుంది

Home Remedies For Hair Problems: ఉరుకుల పరుగుల జీవితం.. మారుతున్న జీవనశైలితో ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తోంది. అయితే వెంట్రుకల సమస్యలకు చింతపండు చక్కటి పరిష్కారంగా కనిపిస్తోంది. ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం చిట్కాలు ఇవే.

1 /6

ఎన్నో ప్రయోజనాలు Home Remedies For Hair Problems: జుట్టు సమస్యలకు చింతపండు చక్కటి పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి చింతపండును ఎలా వినియోగిస్తారో తెలుసుకోండి.

2 /6

చింతపండులో పోషకాలు Home Remedies For Hair Problems: జుట్టు సంరక్షణకు చింతపండు కీలక పాత్ర పోషిస్తుంది. చింతపండు రసంలోని గుణాలు జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న చింతపండు జుట్టు సమస్యలను నివారిస్తుంది.

3 /6

సమస్యలకు చెక్‌ Home Remedies For Hair Problems: చుండ్రు.. పేళ్లు వంటి సమస్యకు చింతపండు రసం నివారిస్తుంది. చింతపండులోని విటమిన్ సీ తలను శుభ్రం చేస్తుంది. చింతపండును రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే బాగా కలిపి చింతపండు రసాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రమైన నీటితో తల స్నానం చేయండి.

4 /6

మృదువైన జుట్టు Home Remedies For Hair Problems: చింతపండు రసంతో జుట్టును మృదువుగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో చింతపండు రసం తీసుకుని దానిలో కలబంద రసం వేసి కలపండి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును కడగాలి.

5 /6

జుట్టు పెరుగుదల Home Remedies For Hair Problems: చింతపండు రసం జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తుంది. చింతపండు రసాన్ని క్రమంగా జుట్టుకు పట్టిస్తుంటే తల భాగానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ కారణంగా జుట్టు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.

6 /6

జుట్టు రాలడం: ఈ సమస్యతో బాధపడుతుంటే చింతపండు రసం వాడితే సమస్య తగ్గుతుంది. చింతపండు రంసంలోని యాంటీఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ జుట్టును మూలాల నుంచి బలపరిచి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.