ఆధునిక జీవన విధానంలో తెల్ల జుట్టు ప్రధాన సమస్యగా మారింది. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణాలతో వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ పెను సమస్యగా మారింది. తక్కువ వయస్సుకే జుట్టు నెరిసిపోతోంది. మార్కెట్‌లో లభించే హెయిర్ డైస్‌తో తాత్కాలికంగా జుట్టు నల్లబడినా దుష్పరిణామాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే సహజసిద్ధంగా మీ జుట్టు నల్లబడుతుంది.
Black Hair Remedy: ఆధునిక జీవన విధానంలో తెల్ల జుట్టు ప్రధాన సమస్యగా మారింది. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణాలతో వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ పెను సమస్యగా మారింది. తక్కువ వయస్సుకే జుట్టు నెరిసిపోతోంది. మార్కెట్‌లో లభించే హెయిర్ డైస్‌తో తాత్కాలికంగా జుట్టు నల్లబడినా దుష్పరిణామాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే సహజసిద్ధంగా మీ జుట్టు నల్లబడుతుంది.
వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ సమస్యలకు ప్రధాన కారణం పోషకాల లోపం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి, కాలుష్యం వంటివి. అందుకే చిన్న వయస్సుకే మగ, ఆడ తేడా లేకుండా అందరికీ ఈ సమస్య తలెత్తుతోంది.
గతంలో అయితే వృద్ధాప్యంలోనే తెల్ల జుట్టు సమస్య ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యుక్త వయస్సులో నడి వయస్సులోనే వైట్ హెయిర్ సమస్య ఉత్పన్నమౌతుంది.
చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్య రావడంతో నలుగురిలో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అందంపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య తలెత్తితే అంద విహీనంగా తయారవుతుంటారు
తెల్లజుట్టును సహజసిద్దంగా నల్లగా మార్చేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్ హోమ్ రెమిడీస్‌లో ఒకటి డికాషన్. టీ పొడి నీళ్లు మరిగించి డికాషన్ చేసుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడ్డాక ఉప్పు కలిపి తలకు కుదుళ్లతో సహా పట్టించాలి. ఓ అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.
కొబ్బరి నూనెలో ఉసిరి, మెంతి పొడి కలిపి రాసినా మంచి ఫలితాలుంటాయి. వారంలో 2-3 సార్లు చేస్తే బాగుంటుంది.