Hyundai Exter: హ్యుండయ్ నుంచి మిడ్ సైజ్ ఎస్‌యూవీ, ధర 6 లక్షలే, చూస్తే మతి పోతుంది మరి

Hyundai Exter: హ్యుండయ్ కంపెనీ నుంచి మరో ఎస్‌యూవీ లాంచ్ అయింది. హ్యుండయ్ ఎక్స్ ‌టర్ పేరుతో ఇవాళ లాంచ్ అయిన ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. టాటా పంచ్‌తో పోటీ పడే ఈ ఎస్‌యూవీ ధర కేవలం 6 లక్షలే. ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..
 

Hyundai Exter: హ్యుండయ్ ఎక్స్‌టర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ. టాటా పంచ్‌కు పోటీగా ఇవాళే మార్కెట్‌లో వచ్చింది. ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో విశేషంగా ఆకట్టుకుంటోంది ధర కూడా 6 లక్షల కంటే తక్కువే. 

1 /5

ఈ కారును హ్యుండయ్ కంపెనీ 6 వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభధర 5.99 లక్షలు కాగా ఎస్ వేరియంట్ ధర 7,26,990 రూపాయలు. ఇందులో ఎస్ఎక్స్ వేరియంట్ అయితే 7,99,990 రూపాయలుంది. ఇక ఎస్ఎక్స్ ఓ అయితే 8,63,990 రూపాయలు. ఇక టాప్ వేరియంట్ అయితే 9,31,990 రూపాయలుంది. ఇందులోనే సీఎన్జీ వేరియంట్ అయితే 8,23,990 రూపాయలుంది.

2 /5

హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో 1.2 లీటర్ల నేచురల్లీ యాస్పిరేటెడ్, 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్, ఉంటుంది.  83 హెచ్‌పి, 114 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ఉన్నాయి. 

3 /5

హ్యుండయ్ ఎక్స్‌టర్ ‌ సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్, డ్యూయర్ కెమేరా ఉన్నాయి.  8 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.

4 /5

హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్పోర్ట్ స్కిడ్ ప్లేట్, 15 ఇంచెస్ డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్, ఇలా వివిధ ప్రత్యేకతలున్నాయి.

5 /5

హ్యుండయ్ ఎక్స్‌టర్ ఇండియన్ మార్కెట్లో అత్యంత చౌకైన్ ఎస్‌యూవీగా లాంచ్ అయింది. ఈ కారు ద్వారా హ్యుండయ్ కంపెనీ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర 6 లక్షల కంటే తక్కువే. టాటా పంచ్‌తో ఈ కారు పోటీ పడనుంది.