Ibomma Telugu: OTTల కళ్ళు కప్పి ఐ బొమ్మ ఈ వారం స్ట్రీమింగ్ చేస్తున్న కొత్త సినిమాలు ఇవే!

iBomma March 1st Week Telugu Movies: ప్రముఖ ఓటీటీ కళ్ళు కప్పి ఐ బొమ్మ ఈ వారం ఐదు కొత్త సినిమాలను స్ట్రీమింగ్‌ చేస్తోంది. అంతేకాకుండా వీటిపై కొత్త డౌన్‌లోడింగ్‌ ఆప్షన్‌ను కూడా అందించింది. అయితే ఈ మూవీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

  • Mar 01, 2024, 22:49 PM IST
1 /6

ప్రముఖ ఓటీటీలకు మరోసారి ఐ బొమ్మ బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన కొత్త సినిమాలన్నీ ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది. గతంలో ఈ వెబ్‌సైట్‌పై సినీ నిర్మాతలంతా ఎన్నోసార్లు పోలీసులకు కంప్లైంట్ చేసిన ఐ బొమ్మ ఏ మాత్రం తగ్గకుండా కొత్త సినిమాలను ఎప్పటికప్పుడే స్ట్రీమింగ్ చేస్తోంది. దీని కారణంగా ప్రముఖ ఓటీటీలలో చూసే ప్రేక్షకులు అందరూ ఐబొమ్మాలో ఫ్రీగా చూసేందుకు అలవాటు పడుతున్నారు. అయితే ఐ బొమ్మ దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతివారం ఓటీటీలో విడుదలవుతున్న కొత్త చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ఈవారం కూడా ఐ బొమ్మ కొన్ని కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఆ సినిమాలేంటో వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

2 /6

ప్రముఖ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నేతృత్వంలో మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా ఇటీవలే వచ్చిన యాక్షన్ త్రిల్లర్ మూవీయే ఈగల్. ఈ సినిమా ఫిబ్రవరి 19వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను పొందింది. అయితే ఈ సినిమా మార్చి 1వ తేదీన ప్రముఖ ఓటీపీ ప్లాట్‌ఫామ్ అయినా ఈటీవీ విన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. వీటిలో విడుదలైన క్షణాల్లోనే ఐబొమ్మాలో దర్శనం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  

3 /6

పల్లెలోని జీవనాలకు అడ్డంపట్టే కంటెంట్ తరహాలో రూపొందిన చిత్రమే అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ లభించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలు స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనిని కూడా ఐ బొమ్మ స్ట్రీమింగ్ చేస్తోంది.    

4 /6

ప్రముఖ కమీడియన్ సంతానం ప్రధాన పాత్రధారుడిగా తెరకెక్కిన చిత్రమే అక్యూజ్డ్ నెంబర్ వన్. ఈ మూవీని జాన్సన్ కె దర్శకత్వం వహించగా, ఇది రొమాంటిక్, కామెడీ సన్నివేశాలతో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం 2019లో తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఐదు సంవత్సరాల తర్వాత ఓటీటీలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఈ అక్యూజన్ నెంబర్ వన్ మూవీ కూడా ఐ బొమ్మలోని స్ట్రీమింగ్ అవుతోంది.

5 /6

ఫిబ్రవరి రెండో తేదీన థియేటర్లలో విడుదలైన సైకలాజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్‌తో మంచి పేరు సంపాదించుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఈ గేమాని చిత్రం ఇంత త్వరగా నే ఓటీటీలోకి సడన్ గా రావడం అందులో ఐ బొమ్మ కూడా స్ట్రీమింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. 

6 /6

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ప్రముఖ దర్శకులు కోనేటి నిర్మించిన మూవీనే బూట్ కట్ బాలరాజు. ఈ చిత్రంలో ప్రముఖ కమీడియన్ హీరో సునీల్ కీలక పాత్ర పోషించారు అయితే ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం కూడా ఇటీవలే ఐ బొమ్మలో దర్శనమిచ్చింది. (ఈ కథనానికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం  ఇతర వెబ్సైట్ నుంచి తీసుకొని రాసింది మాత్రమే)