Bank Money: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. 14,15న ఆ సమయాల్లో ఈ ట్రాన్సాక్షన్స్ చేయలేరు.. కారణం ఇదే!

ICICI Bank Money Transfer Service: ప్రముఖ బ్యాంకు అయిన ఐసీఐసీఐ కీలక ప్రకటన చేసింది. మనీ ట్రాన్స్ ఫర్ సర్వీసులకు సంబంధించి డిసెంబర్ 14,15 తేదీల్లో ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ సేవలు పనిచేయవని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ను అందించింది. ఏయే సర్వీసులపై ప్రభావం పడుతుంది..ఏమేం వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /6

RTGS Transactions: నేటికాలం అంతా డిజిటల్ మయంగా మారింది. బ్యాంకులు పనులు అయితే బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేకుండానే ఇంట్లోనే కూర్చుండి చేసుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ సర్వీసులు ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక డిజిటల్ సర్వీసుల్లో యూపీఐ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. దీని ఆధారంగానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక వీటి నిర్వహణలో బ్యాంకుల పాత్ర ఎక్కువే అని చెప్పవచ్చు.   

2 /6

ఇప్పుడు దీనికి సంబంధించే ఐసీఐసీఐ బ్యాంకు ఓ కీలక ప్రకటన చేసింది. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇన్ వార్డ్ అండ్ అవుట్ వార్డ్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్లపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకు దీనికి సంబంధించి..కస్టమర్లకు ఇ మెయిల్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. 

3 /6

2024 డిసెంబర్ 14న రాత్రి 11.55 గంటల నుంచి ఉదయం 15 ఉదయం 6 గంటల వరకు ఈ డౌన్ టైమ్ ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో చేసిన ఇన్ వార్డ్, అవుట్ వార్డ్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్లు నిలిచిపోతాయి. ఉదయం 6గంటల తర్వాతే ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ సమయంలో బ్యాంకు కస్టమర్లు ఐ  మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా  NEFT, IMPS, UPI వాడుకోవచ్చని బ్యాంకు స్పష్టం చేసింది. కేవలం ఆర్టీజీఎస్ సర్వీసులపైనే ప్రభావం పడుతుందని తెలిపింది. 

4 /6

ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట. ఇది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంకు ఖాతాల మధ్య రియల్ టైములోనే ఎలక్ట్రానిక్ పద్దతిలో మనీ ట్రాన్స్ ఫర్ అవుతుంది. 2 లక్షలలోపు ఈ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్లపై ఐసీఐసీఐ బ్యాంకులో ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్ నుంచి రూ. 2లక్షల నుంచి 5లక్షల వరకు ఈ ట్రాన్సాక్షన్స్ పై  ఛార్జీ రూ. 20ప్లస్ జీఎస్టీ కూడా పడుతుంది. ఇదే 5 నుంచి 10లక్షల మధ్య ఉంటే ఛార్జీ రూ. 45ప్లస్ జీఎస్టీ ఉంటుంది.

5 /6

మీరు ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్టీజీఎస్ ఎలా పంపించవచ్చో చూద్దాం. లాగిన్ అయి బెనిఫిషియరీని యాడ్ చేయాలి. తర్వాత పేమెంట్స్ అండ్ ట్రాన్స్ ఫర్ ట్యాబ్ కింద ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ట్యాబ్ కు వెళ్లి యాడ్ పే పై క్లిక్ చేయాలి. బెనిఫిషియరీ టైప్ దగ్గర అదర్ బ్యాంక్ పేను సెలక్ట్ చేసుకోవాలి.

6 /6

బెనిఫిషిరీ అకౌంట్ డీటెయిల్స్ లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాంక్, బ్రాంచ్ నేమ్ ఆధారంగా బెనిఫిషియరీ ఐఎఫ్ఎస్ సీని సెలక్ట్ చేసుకుని యాడ్ పై క్లిక్ చేసి  కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అయితే..పేయి ట్రాన్సాక్షన్స్ కు అందుబాటులో ఉంటుంది.