Team India: శతక్కొట్టిన స్మృతి మంధనా.. న్యూజిలాండ్‌తో 3 వన్డేల సిరీస్ కైవసం

India Women Beat New Zealand Women By 6 Wickets: ప్రపంచకప్‌లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-1తో న్యూజిలాండ్‌ నుంచి సిరీస్‌ను లాగేసుకున్నారు. స్మృతి మంధాన అద్భుత సెంచరీతో దుమ్మురేపింది.

1 /8

సిరీస్ సొంతం: ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు న్యూజిల్యాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడింది.

2 /8

కీలక మ్యాచ్: అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది.

3 /8

ప్రత్యర్థి ఆలౌట్: మొదట బ్యాటింగ్‌ ఆడిన న్యూజిలాండ్‌ 49.5 ఓవర్లలో 232 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.

4 /8

సులువుగా: భారత మహిళలు 44.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి అతి సునాయాసంగా 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

5 /8

స్మృతి తడాఖా: స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన మరోసారి బ్యాట్‌తో దుమ్మురేపింది. 122 బంతుల్లో శతకం సాధించగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్థ శతకంతో సత్తా చాటింది.

6 /8

గత మ్యాచ్ లు ఇలా: మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 76 రన్స్‌తో గెలుపొందడం విశేషం. 

7 /8

అద్భుతం: ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. సమష్టి కృషితో 34 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

8 /8

అప్పుడు నిరాశ: సొంత గడ్డపై విజయం సాధించిన భారత మహిళలు ప్రపంచకప్‌లో మాత్రం సత్తా చాటకపోవడం క్రికెట్‌ అభిమానులను నిరాశపర్చే అంశంగా మిగిలింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x