Tricolour Food Recipes : ఆగస్టు 15యావత్ భారతానికి వేడుక. స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను జరుపుకుంటాము. అలాంటి ప్రత్యేకమైన రోజు వంటకాలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటే బాగుంటుంది కదా? నేచురల్ కలర్స్ తో టేస్టీ, హెల్తీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు.
Tricolour Food Recipes: ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి పండగ. ఈరోజు వాడవాడలా ఇండిపెండెన్స్ డే సంబురాలు ఘనంగా జరుపుకుంటాము. జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుతుంటాం. దేశభక్తి గీతాలు ఆలపిస్తాము. ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఆ రోజు స్పెషల్ వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటే..అది కూడా త్రివర్ణంలో రెడీ చేసుకుంటే..ఎలా ఉంటుంది. మీ పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ హెల్తీ, టేస్టీ రెసీపీ ఐడియాలు మీకోసం.
పులావ్: పులావ్ అంటే అందరికీ ఇష్టం. ఈ ప్రత్యేకమైన రోజు తినేందుకు పిల్లలు ఇష్టపడతారు. రుచికరమైన హెల్తీ కలర్ రైస్ తయారు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. బచ్చలికూర నేచురల్ ఆకుపచ్చ రంగుకోసం కొబ్బరిపాలు వైట్ కలర్, టమాటాలు నేచురల్ ఆరెంజ్ కలర్ కోసం ట్రై కలర్ పులావ్ లో యాడ్ చేయండి.
తిరంగ ధోక్లా: మూడు రంగులో ధోక్లా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. జెండాలోని మూడు రంగులను ఈ ఫుడ్ లో రుచులను చూడవచ్చు.
త్రివర్ణ సలాడ్: క్యారెట్, పచ్చి బొప్పాయి, దోసకాయలతో త్వరగా చేసుకోవచ్చు. ఈ సలాడ్ రెసిపీలో వెనిగర్, తేనె, సోయా సాస్, ఉప్పు, లవంగాలు, మిరపకాయలతో తయారు చేసిన తీపి, పుల్లని తేనె-సోయా డ్రెస్సింగ్ ఉంటుంది. వేరుశెనగ, రిఫ్రెష్ పుదీనా ఆకుల క్రంచ్‌తో పాటు, ఈ త్రివర్ణ సలాడ్ రెసిపీని తయారుచేయడం సులభం.
త్రివర్ణ పిజ్జా: క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, చీజ్ ఊడిల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఈ వెజిటబుల్ పిజ్జా ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు మీ పిల్లల కోసం తయారు చేసి ఇవ్వండి.
త్రివర్ణ కేక్ : స్వాతంత్ర్య దినోత్సవం రోజు మీ పిల్లల కోసం వెరైటీగా త్రివర్ణ కేక్ తయారు చేసి ఇవ్వండి. త్రివర్ణ చీజ్‌కేక్‌లో వెన్నతో కలిపి కరకరలాడే బిస్కెట్‌లు, లేయర్‌లుగా బంగారు రంగులోకి బేక్ చేసి పైన క్రీమ్ చీజ్ మిక్స్ చేసి చేస్తే రుచిగా ఉంటుంది.