G20 Summit: ఇండియాలో జీ20 సమ్మిట్ జరిగే వేదిక చూశారా, ఇంద్ర భవనాన్ని తలదన్నే నిర్మాణం

G20 Summit: గత ఏడాది అంటే 2022 డిసెంబర్ 1వ తేదీన ఇండియా జీ20 అధ్యక్షత బాధ్యతలు స్వీకరించింది. ఏడాది పాటు ఉంటుంది. ఈ వేదికపై ఈసారి విభిన్న అంశాలపై దాదాపు 200 భేటీలు జరగాల్సి ఉంది. జీ20 సమావేశాల్ని విజయవంతం చేసేందుకు ఇండియా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

G20 Summit: జీ20 గ్రూప్ దేశాల అధ్యక్షుల భేటీకు ఆతిద్యమిచ్చేందుకు ఆధునీకరించిన ఐటీపీవో కాంప్లెక్స్ వేదికగా ఉండనుంది. జూలై 26వ తేదీన ప్రారంభం కానున్న ఈ భవనం ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. అంతటి అద్భుతమైన ఇంటీరియర్, అవుట్ లుక్స్, సౌకర్యాలు ఉన్నాయి. 7 స్టార్ హోటల్‌కు తీసిపోని విధంగా ఇందులో వసతులుంటాయి. 
 

1 /8

సెప్టెంబర్ 9-10 మధ్య జరిగే 18వ జీ20 శిఖరాగ్ర సమావేశం ఇక్కడే జరగనుంది.

2 /8

ఈ కాంప్లెక్స్ ప్రారంభం జూలై 26న జరగనుంది. ఈ కాంప్లెక్స్  పునరుద్ధరణ పనుల్ని ఎన్ బీసీసీకు అప్పగించారు.  

3 /8

ఐఈసీసీకు వచ్చే అతిధుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ ఒకేసారి 5500 వాహనాల పార్కింగ్ ఉంటుంది. 

4 /8

ఐటీపీవో కాంప్లెక్స్‌లోని ప్రదర్శన హల్ చాలా బాగుంటుంది. బిజినెస్ డెవెలప్‌మెంట్, నెట్ వర్కింగ్ అవకాశాలు పెంచేందుకు సరైన వేదిక ఇది.

5 /8

అద్భుతమైన సౌకర్యాలతో పాటు 3 వేలమంది కూర్చునే సామర్ధ్యం కలిగిన ఎంఫీ థియేటర్ ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకత. అంటే 3 వేల పీవీఆర్ థియేటర్లకు సమానం. 

6 /8

ఆస్ట్రేలియాలోని సుప్రసిద్ధ సిడ్నీ ఒపేరా హౌస్ సామర్ధ్యం 5500 కాగా ఈ కన్వెన్షన్ సెంటర్ లెవెల్ 3 సామర్ధ్యమే 7000 గా ఉంది.

7 /8

జీ20 కీలక భేటీ ఇక్కడే జరగనుంది. ఇండియాకు చెందిన ఈ భవనం జర్మనీకు చెందిన హనోవర్ కేంద్రం, షాంఘాయీలోని జాతీయ ప్రదర్శనా కేంద్రాలకు పోటీగా ఉంటుంది.

8 /8

దేశ రాజధాని ఢిల్లీలో 123 ఎకరాల్లో ఉన్న ఈ భవనం దేశంలోని ప్రముర్మాణాల్లో అతి పెద్దది. ఐఈసీసీ కాంప్లెక్స్  అనేది ప్రపంచంలోని టాప్ 10 కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటి.