Top Universities: దేశంలో ప్రఖ్యాత యూనివర్శిటీలు చాలా ఉన్నాయి. కానీ టాప్ యూనివర్శిటీలుగా 5 చెప్పుకోవచ్చు. వీటిలో అడ్మిషన్ లభించడం చాలా కష్టం. ఆ యూనివర్శిటీలేంటో తెలుసుకుందాం.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023 ప్రకారం మొదటి స్థానంలో ఉంది. ఈ యూనివర్శిటికు లభించిన స్కోరు 83.16.
జామియా మిల్లియా యూనివర్శిటీ, న్యూ ఢిల్లీ ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023 లో మూడో స్థానం లభించింది. ఈ వర్శిటీ స్కోరు 67.73గా ఉంది.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, ఢిల్లీ ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో రెండో స్థానం లభించింది. మొత్తం స్కోరు 68.92
జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కోల్‌కతా ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో నాలుగో స్థానం దక్కింది. మొత్తం స్కోరు 66.07గా ఉంది.
బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి ఈ యూనివర్శిటీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2023లో ఐదో స్థానం లభించింది. ఈ వర్శిటీ మొత్తం స్కోరు 65.85.