Gajakesari Yoga 2025: ఈ 3 రాశులకు 2025లో గజకేసరి యోగంతో దుమ్మురేపుతారు..!

Gajakesari Yoga 2025 Lucky Signs: కొత్త సంవత్సరం అతిచేరువలో ఉంది. కొత్త సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు. కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌ ఎలా చేసుకోవాలా? అని ప్లాన్స్‌ వేస్తుంటారు. అంతేకాదు కొత్త ఏడాది తమకు ఎలా ఉంటుందో అని ఆలోచనలో కూడా ఉంటారు. అయితే, జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ 3 రాశులు దుమ్మురేపుతాయి. 
 

1 /5

ఏ రాశి అయినా ఆర్థికంగా తమకు బాగా కావాల్సి వస్తే బాగుండు అనుకుంటారు. కానీ, కొంతమందికి ఎంత కష్టపడినా అనుకున్న పనులు సమయానికి కావు. ఎప్పుడూ పనులు పెండింగ్‌లో పడిపోతుంటాయి. అయితే, కొత్త ఏడాది కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది.  

2 /5

2025 మిథున రాశిలో చంద్రుని, గురుడి కలయిక ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులకు లక్కీ సమయం అవుతుంది. జీవితంలో అనుకున్న పనులు పూర్తవ్వడమే కాదు. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు.  

3 /5

కన్యరాశి.. గజకేసరియోగం వల్ల కన్యరాశి వారికి విశేష ఫలితాలు కలుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్‌లో పురోగతి కలుగుతుంది. విదేశీయానం కూడా ఉంది. కన్యరాశివారికి అనుకోని లాభాలు వచ్చి పడతాయి. భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. అంతేకాదు కోరుకున్న ఉద్యోగం కూడా పొందుతారు.

4 /5

ధనస్సు.. ధనస్సు రాశి వారికి ఈ చంద్రగురు కలయిక వల్ల ఆర్థిక ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు గ్రహాల కలిస్తే గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీంతో ధనస్సు రాశివారికి అపార ఆర్థిక లాభాలు కలుగుతాయి. 

5 /5

మిథున రాశి.. మిథున రాశిలోనే  ఈ గ్రహాల కలయిక ఏర్పడుతుంది కాబట్టి మిథున రాశికి లక్కీ రోజులు ప్రారంభం అవుతాయి. కెరీర్‌ పరంగా మంచి ప్రయోజనాలు చూస్తారు. విదేశాలకు వెళ్లే వారికి ఇది శుభ సమయం. అప్పులు కూడా త్వరగా తొలగిపోతాయి.