Jabardasth Ramprasad: జబర్దస్త్ ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్.. తృటిలో కమెడియన్ సేఫ్‌

Jabardasth Ramprasad Accident: జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన కారులో షూటింగ్‌కు వెళుతున్న క్రమంలో ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో రాం ప్రసాద్ కూడా తన కారు బ్రేక్ వెంటనే వేశాడు. దీంతో రాంప్రసాద్ కారును వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఆయన ముందు ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. 
 

1 /5

బుల్లితెరపై కమెడియన్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు ఆటో రాంప్రసాద్. తన పంచ్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా నవ్విస్తున్నారు.   

2 /5

తన ఇద్దరు మిత్రులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి జబర్దస్త్‌ షో అలరించారు. వాళ్లిద్దరు సినిమాలతో బిజీ అయినా.. ఆటో రాంప్రసాద్ మాత్రం ఈ షోను వీడలేదు.  

3 /5

ఓ వైపు సినిమాల్లో నటిస్తునే.. బుల్లితెరపై కామెడీలు చేస్తున్నాడు. సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి త్రీమంకీస్‌ సినిమాలో ఓ హీరోగా కూడా నటించాడు.  

4 /5

గురువారం తుక్కుగూడ వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.   

5 /5

ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.