Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..

Jio Offers Unlimited Data: జియో అతి తక్కువ ధరలో మరో బడ్జెట్‌ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. 5జీ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ కేవలం రూ.101 కే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ రెండు నెలల పాటు ఉంటుంది. ఈ రీఛార్జీ ప్యాక్‌తో ఇతర బెనిఫిట్స్‌ ఏం ఉంటాయో తెలుసుకుందాం.
 

1 /5

Jio Offers Unlimited Data: జియో ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ధరలను జూలై నెలలో పెంచేసింది. దీంతో జియో ట్యారిఫ్‌ ధరలను రూ. 15 శాతం పెంచేసింది. దీంతో జియో కస్టమర్లు చాలా వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ఎందుకంటే ఆ ప్రభుత్వరంగ కంపెనీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్‌ అందిస్తున్నాయి. దీంతో కొన్ని లక్షల మంది సబ్‌స్కైబర్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తన వినియోగదారులకు అందుబాటులో కొన్ని సరికొత్త ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో 5 జీ స్పీడ్‌ నెట్‌ కూడా వస్తుంది.   

2 /5

రూ. 101 రీఛార్జీ ప్లాన్.. జియో రూ. 101 ప్లాన్‌ ట్రూ అన్‌లిమిటెడ్‌ అప్‌గ్రేడ్స్‌ కేటగరీలోకి వస్తుంది. రూ. 101 ప్లాన్‌ బేస్‌ ప్లాన్‌ ఉన్నంత కాలం అందుబాటులో ఉంటుంది. అంటే ఒక్క జీబీ, లేదా రెండు జీబీల ప్లాన్స్‌ రెండు నెలల కంటే ఎక్కువ ఉండు రీఛార్జీ ప్లాన్స్‌పై దీన్ని రీఛార్జీ చేసుకోవాలి. ఆ బేస్‌ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత కాలం ఈ ప్లాన్ కూడా వర్తిస్తుంది. మీ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ ఉంటే సులభంగా కనెక్ట్ అవ్వచ్చు.

3 /5

ప్రతిరోజు ఒక్క జీబీ కంటే ఎక్కువ ఉపయోగించే వారికి ఇది బెస్ట్‌ ప్లాన్‌. అదనంగా ప్లాన్‌ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. ఇందులో యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా పొందుతారు. దీంతో అదనంగా 4జీ స్పీడ్ నెట్‌ కూడా యాక్సెస్‌ కూడా అందుబాటులో ఉంది.  

4 /5

2024 ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌, రిలయన్స్‌ జియో మార్కెట్లోకి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లను పరిచయం చేసింది. జియో భారత్‌ సిరీస్‌, జియో భారత్‌ వీ3, వీ4. ఇవి 4జీ ఫోన్స్‌. ఈ రెండు సిరీస్‌లలో జియో యాప్స్‌, లైవ్‌ టీవీ యాక్సెస్‌, యూపీఐ డిజిటల్‌ పేమంట్స్‌, వీడియో స్ట్రీమింగ్‌ ఉంటుంది.  

5 /5

ఈ రెండు ఫీచర్‌ ఫోన్‌లలో జియో టీవీ, జియో పే, జియో సినిమా, మెసేజింగ్‌ కాలింగ్‌ కూడా పొందుతారు.