Devara: దేవర కలెక్షన్స్ ఫేకా..? రూ. 500 కోట్లతో రికార్డు బ్రేక్..

Devara Collections: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్  హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. తాజాగా ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. కొంత మంది నెటిజన్స్ మాత్రం ఈ కలెక్షన్స్ ఫేక్ అంటూ మాట్లాడుతున్నారు. మరి ఇందులో నిజా నిజాల విషయానికొస్తే..

1 /6

ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర పార్ట్ -1’. మిక్స్ డ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

2 /6

అంతేకాదు ‘దేవర’ మూవీ తెలంగాణ (నైజాం)లో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అక్కడ ఈ సినిమా రూ. 60 కోట్ల షేర్ (రూ. 111 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

3 /6

తాజాగా ఈ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు అఫీషియల్ గా ఓ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్ని ఫేక్ కలెక్షన్స్ అని చెబుతున్నారు.

4 /6

కానీ జీఎస్జీ ఇతర టాక్సులను లెక్కలేస్తే .. ‘దేవర’ సినిమా రూ. 480 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఓ రూ. 20 కోట్ల గ్రాస్ అదనంగా యాడ్ చేసినట్టు తెలుస్తోంది.

5 /6

దసరాకు వచ్చిన సినిమాలేవి కూడా ‘దేవర’కు పోటీ  ఇచ్చేవిగా లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చాయి. మొత్తంగా ఈ సినిమా చేసిన బిజినెస్ పై దాదాపు రూ. 60 కోట్ల షేర్ రాబట్టింది.

6 /6

ఎన్టీఆర్ విషయానికొస్తే.. దేవర తర్వాత దేవర పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. మరోవైపు ‘వార్ 2’ మూవీతో ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీలు లైన్ లో ఉన్నాయి.