Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా.. ! తారక్ టైమింగే టైమింగ్..

Jr NTR: ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రల వెనక అసలు కారణాలు ఇవేనా..  దేవర షూటింగ్ సమయంలో చేతిక గాయం కావడంతో షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చాడు. ఇక ‘దేవర పార్ట్ 1’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తయ్యాయి.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు ఈ సమయంలోనే ఈయన యాత్రలు చేయడం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా అని సినీ, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

1 /6

Jr NTR: ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో షూటింగ్ లకు కాస్తంత బ్రేక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వరుసగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు ఈ సమయంలోనే ఈ యాత్ర చేయడం వెనక పెద్ద రీజనే ఉందని చెబుతున్నారు.

2 /6

తాజాగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వివిధ సినీ ఇండస్ట్రీల నుంచి పలువురు హాజరై బాలకృష్ణను సత్కరించారు. అయితే ముందు నుంచి ఈ వేడుకలకు ఎన్టీఆర్ ను పిలవకుండా దూరంగా పెట్టినట్టు సమాచారం.

3 /6

ఈ వేడుకలకు చిరు, వెంకటేష్, మోహన్ బాబులతో పాటు శివరాజ్ కుమార్ హాజరయ్యారు. రజినీకాంత్ ఎక్స్ వేదికగా బాలయ్యకు సందేశం పంపించారు. అటు కమల్ హాసన్ కూడా వీడియో కాల్ తో బాలయ్యను విష్ చేసారు. ఈ వేడుకలకు నాని, రానా, అడవి శేష్ వంటి హీరోలు వచ్చినా..ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు రాకపోవడం పెద్ద వెలతిగా కనిపిస్తోంది.

4 /6

అటు బడా స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలు కూడా ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. రామ్ చరణ్, పవన్ తరుపున మెగాస్టార్ వెళ్లారు కాబట్టి వీళ్లిద్దరిని పెద్దగా కన్సిడర్ చేయలేము. కానీ నగరంలో ఉండి ఎన్టీఆర్ వెళ్లకపోతే మాట వస్తుందనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా యాత్రల్లో ఉన్నట్టు ఫోటోలను మీడియాకు లీక్ చేయించినట్టు తెలుస్తోంది.

5 /6

ఒకే నగరంలో ఉండి బాబాయి సినీ స్వర్ణోత్సవ వేడుకలకు రాకపోతే.. మాట వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ సమయంలోనే  కావాలనే ఎన్టీఆర్  కావాలనే ఈ టైమ్ లోనే ఈ  ఆధ్యాత్మిక యాత్రలను పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కు దగ్గర ఉండి మరి ఈ యాత్రల దర్శనం చేయించడం విశేషం.  

6 /6

అటు కర్ర విరగకుండా.. పాము చావకుండా అనే చందంలో అమ్మ, భార్యతో కలిసి కరెక్ట్ సమయం చూసి ఈ డెవోషనల్   టూర్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బాబాయి సినీ స్వర్ణోత్సవానికి ఎన్టీఆర్ హాజరై ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు పిలవని పేరంటానికి వెళ్లి అవమానాల పాలు కావడం కంటే ఈ దేవాలయాలను సందర్శించడం బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.