Kajal Agarwal: డిజైనర్ డ్రెస్సులో.. దివి నుంచి దిగివచ్చిన చందమామల మెరిసిన కాజల్..

Kajal Agarwal bold Instagram photos : ఈ మధ్యనే సత్యభామ సినిమాతో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది హీరోయిన్ కాజల్. సినిమాలతోనే కాకుండా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను ప్రేమలో పడేస్తోంది. రీసెంట్ గా కాజల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి

1 /5

చందమామ సినిమా ద్వారా నిజంగానే తెలుగు ప్రేక్షకుల మదిలో చందమామగా నిలిచిపోయింది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్.. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. 

2 /5

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా పరవాలేదు అనిపించుకోగా.. ఆ తరువాత కాజల్ చేసిన చందమామ చిత్రం మాత్రం మంచి విజయం అందుకుంది. ఇక మగధీర సినిమాతో ఇండస్ట్రీ సూపర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్.   

3 /5

మగధీర తరువాత నుంచి కాజల్కి వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న కాజల్.. బాబు పుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంది. 

4 /5

ఇక బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 3 సినిమాల్లో కూడా కనిపించనుంది. ఇక ఈ మధ్యనే సత్యభామ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిచ్చి పరవాలేదు అనిపించుకుంది.

5 /5

కాగా ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో కాజల్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో కాజల్ ఎప్పటిలానే ఎంతో అందంగా కనిపిస్తూ అభిమానులను.. ఫిదా చేస్తోంది. ఇక కాజల్ తదుపరి సినిమాల కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.