Kajal Aggarwal: గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేసిన కాజల్ అగర్వాల్.. పెళ్లైనా తగ్గని మిత్రవింద దూకుడు..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది.   హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే అందంతో అలరిస్తోంది. హీరోయిన్  లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. సీనియర్ భామ ఇపుడు సినిమాలతో కుమ్మేస్తోంది.

1 /7

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా అదే దూకుడును  మెయింటెన్ చేస్తోంది.

2 /7

తేజ డైరెక్షన్ లో  వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్. 

3 /7

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

4 /7

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది.

5 /7

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తోంది. రీసెంట్ గా సత్యభామ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలరించింది. 

6 /7

కాజల్ అగర్వాల్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా అలరించింది.

7 /7

లాస్ట్ ఇయర్ 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.